నేపాల్‌లో విమానం అదృశ్యం.. మొత్తం 22 మంది.. అందులో న‌లుగురు భార‌తీయులు

Nepal Plane With 22 On Board Including 4 Indians Missing.నేపాల్‌లో ఓ విమానం అదృశ్య‌మైంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  29 May 2022 6:57 AM GMT
నేపాల్‌లో విమానం అదృశ్యం.. మొత్తం 22 మంది.. అందులో న‌లుగురు భార‌తీయులు

నేపాల్‌లో ఓ విమానం అదృశ్య‌మైంది. తారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన 9 NAET ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం పోఖారా నుంచి జోమ్‌సోమ్ బ‌య‌లుదేరింది. ఉద‌యం 9.55 గంట‌ల స‌మ‌యంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌(ఏటీసీ)తో విమానానికి సంబంధాలు తెగిపోయాయి.

ఆ స‌మ‌యంలో విమానంలో 19 మంది ప్ర‌యాణీకుల‌తో పాటు ముగ్గురు సిబ్బంది ఉన్నారు. వీరిలో న‌లుగురు భార‌తీయులు, ముగ్గురు జ‌పాన్ వాసులు కాగా.. మిగిలిన వారంతా నేపాల్ వాసులు అని తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారు. విమానాన్ని పైలట్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే న‌డుపుతున్న‌ట్లు చెప్పారు.

విమానం చివ‌రి సారిగా ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ ప్రాంతంలో క‌నిపించింద‌ని ఆ త‌రువాత దౌల‌గిరి ప‌ర్వ‌తం వైపు మ‌ళ్లింద‌ని అధికారులు అంటున్నారు. ఆ త‌రువాత నుంచి విమానంతో సంబంధాలు తెగిపోయాయ‌న్నారు.

విమానం ఆచూకీ కోసం రెండు హెలికాఫ్ట‌ర్ల‌ను రంగంలోకి దింపిన‌ట్లు ముస్తాంగ్ జిల్లా డీఎస్పీ రామ్‌కుమార్‌ద‌ని తెలిపారు. వీటితో పాటు నేపాల్ సెనిక హైలికాప్ట‌ర్ ఎంఐ-17ని కూడా సెర్చ్ ఆప‌రేష‌న్‌కు పంపిన‌ట్లు నేపాల్ ఆర్మీ అధికారి తెలిపారు.

Next Story