కుప్పకూలిన 12 అంతస్తుల భ‌వ‌నం.. 99 మంది మిస్సింగ్‌

Nearly 100 people missing as oceanfront Miami area building collapses.అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Jun 2021 10:51 AM IST
కుప్పకూలిన 12 అంతస్తుల భ‌వ‌నం.. 99 మంది మిస్సింగ్‌

అమెరికా దేశంలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామి న‌గ‌రంలో ఓ 12 అంత‌స్తుల భ‌వ‌నంలోని కొంత భాగం కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో 99 మంది క‌నిపించ‌కుండా పోయారు. వీరంతా భ‌వ‌నం శిధిలాల కింద చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. వీరిని శిథిలాల కింద నుంచి వెలికి తీసేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప్ర‌మాదం జరిగిన స‌మ‌యంలో భ‌వ‌నంలో 201 మంది ఉన్న‌ట్లు అధికారులు బావిస్తున్నారు. ప్ర‌స్తుతం 102 మంది ఆచూకీ లభింద‌ని.. మ‌రో 99 మంది ఆచూకీ తెలియాల్సి ఉంద‌ని అధికారులు అంటున్నారు.

ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్‌, అధికారులు అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. తొలి విడతలో శిథిలాల కింద చిక్కుకున్న 35 మందిని బయటకు తీయగా వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. వెంట‌నే వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మిగిలిన వారికి స్వ‌ల్ప‌గాయాలు కావ‌డంతో ప్ర‌థ‌మ చికిత్స చేశారు.

1980లో నిర్మించిన ఈ బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడానికి గల కారణాలు తెలియకపోగా దాదాపుగా బిల్డింగ్ సగభాగం కూలిపోయినట్టుగా తెలుస్తోంది. బిల్డింగ్ కూలిన సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం రాగా క్షణాల్లో ఆ ప్రాంతంలో దుమ్ము, ధూళితో నిండిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ దశ్యాలు 2001లో న్యూయార్క్ నగరంలో కూలిన ట్విన్ టవర్ల దాడిని తలపించినట్లుగా కొందరు స్థానికులు చెబుతున్నారు.

Next Story