నవాజ్‌ షరీఫ్‌ సంచలన నిర్ణయం.. పాక్‌ ప్రధాని ఎవరంటే..

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

By Srikanth Gundamalla
Published on : 14 Feb 2024 8:11 AM IST

nawaz sharif, sensation decision, pakistan, new prime minister,

నవాజ్‌ షరీఫ్‌ సంచలన నిర్ణయం.. పాక్‌ ప్రధాని ఎవరంటే..

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్‌ తరఫున ప్రధాని అభ్యర్థిని ప్రకటించారు. తన సోదరుడు, మాజీ ప్రధాని అయిన షహబాజ్‌ షరీఫ్‌ను ప్రధాని అభ్యర్థిగా ఆయన నామినేట్ చేశారు. దాంతో షహబాజ్‌ మరోసారి పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాలుగోసారి ప్రధానిగా నవాజ్ షరీఫ్ బాధ్యతలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయన అనూహ్యంగా తమ్ముడు షహబాజ్‌ను నామినేట్ చేశారు. నవాజ్ షరీఫ్ నిర్ణయం పాక్ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

కాగా.. షహబాజ్ షరీఫ్‌ను పాక్ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన విషయాన్ని పీఎంఎల్‌-ఎన్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబు ఎక్స్‌ వేదికగా ప్రకటించారు. తమ అధినేత నవాజ్ షరీఫ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అలాగే నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్‌ను పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పీఎంఎల్-ఎన్ ఆధ్వర్యంలో సంకీర్ణయం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతు తెలిపిన ఆయా రాజకీయ పార్టీలకు నవాజ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇక పాకిస్తాన్‌ ప్రస్తుతం ఉన్న సంక్షభాల నుంచి బయటపడుతుందని ఆశిస్తున్నట్లు నవాజ్ షరీఫ్ ఆకాంక్షించారు.

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ న్నికల్లో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. దాంతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అనివార్యం అయ్యింది. పాక్‌లో మొత్తం 265 స్థానాలు ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ సారధ్యంలోని పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీ నుంచి స్వతంత్రులుగా పోటీచేసిన అభ్యర్థులు 101 స్థానాల్లో గెలిచారు. ఇక పీఎంఎల్‌-ఎన్ 75 స్థానాల్లో గెలవగా.. పీపీపీ 54 స్థానాల్లో విజయం సాధించింది. పాక్ సైన్యం ఆశీస్సులున్న నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పీఎంఎల్‌-ఎన్‌ పార్టీ బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP)తో చర్చలు జరిపింది. పీఎంఎల్‌ ఎన్ ప్రధాని అభ్యర్థికి తమ మద్దుతు ఉంటుందని వెల్లడించారు.

Next Story