భూమి మీదకు సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, కారణమేంటో చెప్పిన నాసా

నాసా, స్పేస్ ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ మరోసారి వాయిదా పడింది.

By Knakam Karthik  Published on  13 March 2025 9:27 AM IST
World News, Sunita Williams, Wilmore, SpaceX, Crew-10, Nasa

భూమి మీదకు సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం, కారణమేంటో చెప్పిన నాసా

దాదాపు 9 నెలలుగా అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమి మీదకు తీసుకువచ్చేందు చేపట్టిన నాసా, స్పేస్ ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ-10 మిషన్ మరోసారి వాయిదా పడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధం అయ్యింది. అయితే అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమ గాముల రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

జూన్ 5, 2024న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారు ఐఎస్ఎస్‌కు చేరిన సంగతి తెలిసిందే. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు వారం రోజులకే భూమిని చేరాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరింది. సునీతా విలియమ్స్, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్‌లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.

ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఐఎస్ కు పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో అధికారులు తెలిపారు. ఇక సునీత విలియమ్స్, విల్మోర్ కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. తమ కోసం మార్చి 12న స్పేస్ ఎక్స్ కు చెందిన క్రూ 10 అంతరిక్ష నౌక రానుందని..నౌకలో కొత్తగా ఐఎస్ఎస్ లోకి వచ్చ వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకోనున్నారని తెలిపారు. తర్వాత మార్చి 19న ఆ నౌకలోనే తిరిగి భూమి మీదకు చేరుకుంటామని తెలిపారు.

క్రూ-10 స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, ఇద్దరు సిబ్బంది కొన్ని రోజుల పాటు ISSలో కలిసి ఉంటారు. తరువాత, విలియమ్స్, విల్మోర్ నాసా వ్యోమగాములు నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్‌లతో తిరుగు ప్రయాణం చేస్తారు. అయితే, ఫ్లోరిడా తీరంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటం వల్ల వారు తిరిగి రావడం మరింత ఆలస్యం కావచ్చు.

Next Story