నేడే నాసా ఆర్టెమిస్-1 ప్రయోగం.. చంద్రుడి మీదకు మనిషిని చేర్చటమే లక్ష్యం
NASA is all set for the Artemis 1 launch..The mission of this project is to send a man to the moon. 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు చందమామపైకి మళ్లీ మనిషిని పంపేందుకు తొలి అడుగు పడబోతోంది. గతంలో చందమామపై
By అంజి Published on 29 Aug 2022 10:12 AM IST50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు చందమామపైకి మళ్లీ మనిషిని పంపేందుకు తొలి అడుగు పడబోతోంది. గతంలో చందమామపై నామమాత్రపు సందర్శనలు మాత్రమే సాగాయి. కానీ ఇప్పుడు అలా కాదు.. చందమామపై శాశ్వతంగా ఉండడానికి పునాదులు వేయనున్నారు. లోతైన పరిశోధనల కోసం స్టేజ్ ఏర్పాటు చేయనున్నారు. ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ఈ యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు అంతరిక్షంలోకి దూసుకెళతాయి. మొదటి ప్రయోగంలో.. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. కానీ తర్వాత ప్రయోగాలు మాత్రం మానవసహితంగానే సాగనున్నాయి.
ఆర్టెమిస్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధంమైంది. ఇవాళ స్పెస్ షిప్ నింగికెగసేందుకు రెడీ అయ్యింది. మూడు దశల్లో నాసా ఆర్టెమిస్ ప్రాజెక్ట్ కొనసాగనుంది. ఆర్టెమిస్ 2 కోసం 2024లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్టెమిస్ 3 కోసం 2025లో ఏర్పాట్లు చేయనున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే.. మానవ ప్రత్యామ్నాయ స్థావరంగా ఆర్టెమిస్ ఉండనుంది. 2025 నాటి కల్లా చంద్రుడి మీద ఉన్న సౌత్ పోల్ మీదకు మనిషిని చేర్చటమే ఆర్టిమెస్ మిషన్ లక్ష్యం. అంతే కాదు తొలిసారిగా ఓ మహిళను, ఓ నల్లజాతీయుడిని కూడా చంద్రుడి మీదకు పంపించాలనేది ఆర్టెమిస్ లో లక్ష్యాల్లో ఒకటి. చంద్రుడిపై స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే.. అక్కడి నుంచి మార్స్ సహా అనేక అంతరిక్ష పరిశోధనలు చేసేందుకు వీలవుతుందని నాసా ప్రణాళిక రచించింది.
ఈ ప్రాజెక్టులో ప్రధానంగా స్పేస్ లాంచ్ సిస్టమ్ (ఎస్‌ఎల్‌ఎస్) అనే రాకెట్, ఒరాయన్ అనే క్యాప్సూల్ ఉన్నాయి. ఆర్టెమిస్ 1 ను ఈ ఆగస్టు 29న ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు. ఆ రాకెట్‌ను స్పేస్ లాంచ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. దాదాపు 100 మీటర్ల పొడవున్న ఈ రాకెట్‌ను కెన్నడీ స్పేస్ సెంటర్‌లోని తయారీ భవనం నుంచి భారీ ట్రక్ మీద పెట్టి లాంచ్ పాడ్ 39బికి తరలించారు.
ఒరాయన్ క్యాప్సూల్
ఎస్‌ఎల్‌ఎస్ పైభాగంలో ఒరాయన్ క్యాప్సూల్ ఉండనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములు ప్రయాణించడానికి ఛాన్స్ ఉంది. మరో వ్యోమనౌకకు అనుసంధానం కావాల్సిన అవసరం దీనికి ఉండదు. ఏకబిగిన 21 రోజుల పాటు చంద్రుడి కక్ష్యలో ఇది పనిచేయగలదు. ఇందులో వ్యోమగాములు కూర్చునే క్రూ మాడ్యూల్ కీలకం. అంతరిక్ష యాత్రలకు సంబంధించిన సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొనేలా దీన్ని తయారుచేశారు. క్రూ మాడ్యూల్‌కు యూరోప్ స్పేస్ ఏజేన్సీ నిర్మించిన సర్వీసు మాడ్యూల్ ఉంటుంది. అది ఇంధనం, శక్తిని అందిస్తుంది. దానికి సోలార్ ప్లేట్లు ఉంటాయి.
ఈ ప్రయోగానికి ఆర్టెమిస్ అనే పేరు ఎందుకు?
గ్రీక్ పురాణాల ప్రకారం.. ఆర్టెమిస్ ఒక దేవత. ఆమె జ్యూస్ కుమార్తె, అపోలోకు కవల సోదరి కూడా. దీంతో పాటు ఆర్టెమిస్ యాత్రల్లో భాగంగా మహిళా వ్యోమగామికీ అవకాశం కల్పిస్తున్నందువల్ల ఈ దేవత పేరును నాసా ఎంచుకుంది. ఈ ప్రాజెక్టుకు 9300 కోట్ల డాలర్లు ఖర్చవుతోంది. ఆర్టెమిస్-1 ఖర్చు 400 కోట్ల డాలర్లు అవుతోంది. 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్-1 13 లక్షల కిలోమీటర్లు ప్రయాణించనుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్ విడిపోతుంది. ఇప్పటి వరకు చంద్రుని 12 మంది కాలుమోపారు.