ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టీరియస్ వస్తువు కలకలం

పశ్చిమ ఆస్ట్రేలియాలోని రిమోట్ బీచ్‌లోకి ఓ రహస్యమైన వస్తువు కొట్టుకు వచ్చింది. ఈ అంతుచిక్కని వస్తువు స్థానికంగా కలకలం రేపింది.

By అంజి  Published on  18 July 2023 8:51 AM IST
Mysterious object, Australian beach, Green Head, Chandrayaan-3

ఆస్ట్రేలియా బీచ్‌లో మిస్టీరియస్ వస్తువు

పశ్చిమ ఆస్ట్రేలియాలోని రిమోట్ బీచ్‌లోకి ఓ రహస్యమైన వస్తువు కొట్టుకు వచ్చింది. ఈ అంతుచిక్కని వస్తువు స్థానికంగా కలకలం రేపింది. భారీ పరిమాణంలో ఉన్న ఆ వస్తువు పూర్తిగా ధ్వంసమైన స్థితిలో కనిపిస్తోంది. స్థూపాకారపు రాగి రంగు లోహాం కలిగిన ఆ వస్తువు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. అయితే అక్కడి అధికారులు ఆ వస్తువు "సురక్షితమైనదా.. కాదా?" అని తేల్చే పిలో పడ్డారు. అయితే ఆ వస్తువు ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియరాలేదు. పెర్త్‌కు ఉత్తరాన ఉన్న గ్రీన్ హెడ్ సమీపంలో కనుగొనబడిన వస్తువు.. మొదట్లో ఆందోళనలను లేవనెత్తింది. ప్రస్తుతం ఆ వస్తువుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వస్తువుకు దూరంగా ఉండాలని అక్కడి ప్రజలకు అధికారులు హెచ్చరిక జారీ చేశారు.

ఈ మిస్టీరియస్‌ వస్తువుపై ఆస్ట్రేలియా స్పేస్‌ ఏజెన్సీ దర్యాప్తు ప్రారంభించింది. ఇది విదేశీ అంతరిక్ష ప్రయోగ వాహనానికి సంబంధించినది కావొచ్చని స్పేస్‌ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. ఈ విషయమై పలు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ వస్తువుకు దూరంగా ఉండాలని, కదిపే ప్రయత్నం చేయొద్దని సూచించింది. అయితే ఆ వస్తువు భారత్‌కు చెందిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు సంబంధించినదిగా భావిస్తున్నట్లు అంతరిక్ష నిపుణురాలు డా.ఏలిస్‌ గార్మన్‌ పేర్కొన్నారు. ఇటీవల చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలంలో ప్రయాణించిన నేపథ్యంలో ఆ రాకెట్ నుంచి విడివడి కింద పడ్డ శకలం అయి ఉంటుందన్న చర్చ సోషల్‌ మీడియాలో నడుస్తోంది.

Next Story