శరణార్ధి శిబిరంపై ఫిరంగి దాడి, 29 మంది మృతి
చైనా సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య మయన్మార్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఫిరంగి దాడి జరిగింది. ఈ ఘటనలో 29 మంది మరణించారు.
By అంజి Published on 11 Oct 2023 6:30 AM GMTశరణార్ధి శిబిరంపై ఫిరంగి దాడి, 29 మంది మృతి
చైనా సరిహద్దుకు సమీపంలోని ఈశాన్య మయన్మార్‌లోని శరణార్థి శిబిరంపై జరిగిన ఫిరంగి దాడి జరిగింది. ఈ ఘటనలో 29 మంది మరణించారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 56 మంది గాయపడ్డారు. వీరిలో 44 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ నియంత్రణలో ఉన్న ఈ శరణార్థి శిబిరం లైజా సమీపంలో ఉంది. మరణించిన వారిలో 11 మంది చిన్నారులు ఉన్నట్లు కచిన్ అధికారులు తెలిపారు. మయన్మార్‌లోని అత్యంత శక్తివంతమైన తిరుగుబాటు గ్రూపులలో కచిన్ ఇండిపెండెన్స్ ఒకటి, అనేక దశాబ్దాలుగా స్వయం పాలన కోసం సైన్యంతో ఘర్షణ పడుతోంది. అయితే ఈ దాడులతో తమకు సంబంధం లేదని మయన్మార్ ఆర్మీ ప్రకటించింది.
కాగా బాధితులందరూ పౌరులేనని కేఐఓ ప్రతినిధి బీబీసీకి తెలిపారు. కచిన్ రాష్ట్రంలో 63 ఏళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల్లో ఇది అత్యంత ఘోరమైన దాడి. మిలిటరీ ప్రభుత్వంతో పోరాడుతున్న ఇతర తిరుగుబాటు గ్రూపులకు కాచిన్ మద్దతు పెరుగుతున్నందున గత ఏడాది కాలంగా కచిన్ ఇండిపెండెన్స్ ఆర్గనైజేషన్ నిర్వహించే ప్రాంతాలపై సాయుధ దళాలు దాడులను పెంచాయని కచిన్ అధికారులు చెబుతున్నారు. 2021 తిరుగుబాటులో మిలటరీ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిలో ఈ దాడి ఒకటి, ఇది దేశవ్యాప్తంగా ప్రతిఘటన ఉద్యమం, సాయుధ జాతులతో సంఘర్షణకు దారితీసింది.