క‌న్న బిడ్డ‌ల‌ను మూడో అంత‌స్థులో ఉన్న కిటికిలోంచి ప‌డేసిన త‌ల్లి.. వీడియో వైర‌ల్‌

Mother Rescues children from fire by dropping them from window.ఓ బిల్డింగ్‌లోని మూడో అంత‌స్థులో అగ్నిప్ర‌మాదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Feb 2021 6:58 AM GMT
క‌న్న బిడ్డ‌ల‌ను మూడో అంత‌స్థులో ఉన్న కిటికిలోంచి ప‌డేసిన త‌ల్లి..  వీడియో వైర‌ల్‌

ఓ బిల్డింగ్‌లోని మూడో అంత‌స్థులో అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. మంట‌లు వేగంగా వ్యాపిస్తున్నాయి. ద‌ట్టంగా పొగ అలుముకుంది. బ‌య‌ట‌కు వెళ్లే దారి లేదు. అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించిన వారు రావ‌డానికి స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో ఆ త‌ల్లి హృద‌యం త‌ల్ల‌డిలింది. పిల్ల‌ల‌ను ఎలాగైనా ర‌క్షించుకోవాల‌ని ఆరాట‌ప‌డింది. వెంట‌నే కిటికి ఓపెన్ చేసి సాయం చేయాల‌ని కోరింది. ఆమె త‌న న‌లుగురు పిల్ల‌ల్ని.. ఒక‌రి త‌రువాత మ‌రొక‌రి కిటికిలోంచి కింద‌కు విసిరేసింది ఈ ఘ‌ట‌న ట‌ర్కీ దేశంలోని ఇస్తాంబుల్‌లో చోటుచేసుకుంది.

ఇస్తాంబుల్‌లోని ఓ భ‌వ‌నంలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అపార్ట్‌మెంట్‌లోని మూడ‌వ అంత‌స్థులో మంట‌లు వ్యాపించాయి. ఆ అంత‌స్తులో ఓ మ‌హిళ త‌న న‌లుగురు పిల్ల‌ల‌తో కలిసి నివాసం ఉంటుంది. బ‌య‌ట‌కు రావ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. మంట‌ల ధాటికి వీలుప‌డ‌లేదు. ఇంట్లో ద‌ట్టంగా పొగ అలుముకుంటోంది. శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బందిగా ఉంది. త‌న పిల్ల‌ల‌ను ఎలాగైనా ర‌క్షించుకోవాల‌ని ఆ త‌ల్లి మ‌న‌సు త‌ల్ల‌డిలింది. వెంట‌నే రోడ్డు వైపు ఉన్న కిటీకి తెరిచి.. ఆ మార్గంలో వెలుతున్న వారిని సాయం చేయాల‌ని కోరింది. వారు వెంట‌నే బ్లాంకెట్లు ప‌ట్టుకుని రెడీ ఉన్నారు. వెంట‌నే ఆ మ‌హిళ‌... త‌న పిల్ల‌ల‌ను ఒక‌రి త‌రువాత ఒక‌రి కిటీకి నుంచి కింద‌కు విసిరి వేసింది. కింద ఉన్న‌వారు ఆ పిల్ల‌ల‌ను ప‌ట్టుకున్నారు. ఈ ప్ర‌మాదం నుంచి ఆ త‌ల్లితో పాటు పిల్ల‌లు కూడా క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆ త‌ల్లి చేసిన సాహాసాన్ని అంద‌రూ మెచ్చుకుంటున్నారు.


Next Story