మాస్కో నుంచి గోవా వ‌స్తున్న విమానం దారి మ‌ళ్లింపు.. 11 రోజుల్లో రెండో ఘ‌ట‌న‌

Moscow-Goa flight diverted to Uzbekistan after bomb threat.రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బ‌య‌లుదేరిన విమానాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 Jan 2023 7:07 AM GMT
మాస్కో నుంచి గోవా వ‌స్తున్న విమానం దారి మ‌ళ్లింపు.. 11 రోజుల్లో రెండో ఘ‌ట‌న‌

రష్యా రాజధాని మాస్కో నుంచి గోవాకు బ‌య‌లుదేరిన విమానాన్ని ఉజ్బెకిస్థాన్‌కు దారి మ‌ళ్లించారు. బాంబు బెదిరింపు రావ‌డంతో విమానాన్ని దారి మ‌ళ్లించారు.

రష్యాలోని పెర్మ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అజుర్ ఎయిర్ సంస్థ‌కు చెందిన AZV2463 అనే విమానం 240 మంది ప్ర‌యాణీకులతో గోవాకు బ‌య‌లు దేరింది. షెడ్యూల్ ప్ర‌కారం ఈ విమానం శ‌నివారం తెల్ల‌వారుజామున 4.15 గంట‌ల స‌మ‌యంలో గోవాలోని దబోలిమ్ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. అయితే.. విమానంలో బాంబు అమర్చినట్లు దబోలిమ్ విమానాశ్రయ డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12.30 గంటలకు ఇమెయిల్ వ‌చ్చింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు విమానాశ్ర‌య సిబ్బందికి స‌మాచారం అందించారు. అప్ప‌టికి విమానం ఇంకా భార‌త గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించ‌కపోవ‌డంతో ఉజ్బెకిస్థాన్‌కు దారి మ‌ళ్లించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

కాగా.. 11 పదకొండు రోజుల్లో మాస్కో-గోవా విమానానికి బాంబు బెదిరింపు రావ‌డం ఇది రెండోసారి. జనవరి 9న మాస్కో నుంచి గోవా వ‌స్తున్న అజుర్ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు వ‌చ్చింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు విమానాన్ని గుజ‌రాత్లోని జామ్‌న‌గ‌ర్ ఎయిర్‌పోర్టులో అత్య‌వ‌స‌రంగా ల్యాండ్ చేశారు. విమానం ల్యాండింగ్ అయిన తర్వాత బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో పాటు సీఐఎస్ఎఫ్ అధికారులు, కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రయాణికులను దింపి విమానాన్ని తనిఖీ చేశారు.

నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌కు విమానంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అనంత‌రం విమానం జామ్‌నగర్ విమానాశ్రయం గోవాకు వెళ్లింది.

Next Story