Video: సేఫ్‌గా భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్‌

సునీత, బుచ్‌ విల్మోర్‌లతో పాటు మరికొందరు అస్ట్రోనాట్స్‌తో 'క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక' ఇవాళ తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది.

By అంజి  Published on  19 March 2025 6:37 AM IST
Sunita Williams, Butch Wilmore, space, Nasa, earth

సేఫ్‌గా భూమిపై అడుగుపెట్టిన సునీతా విలియమ్స్‌

సునీతా విలియమ్స్‌ భూమి మీద అడుగుపెట్టారు. సునీత, బుచ్‌ విల్మోర్‌లతో పాటు మరికొందరు అస్ట్రోనాట్స్‌తో 'క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక' ఇవాళ తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. నాలుగు పారాచూట్ల సాయంతో వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా దిగింది. వెంటనే నాసా సిబ్బంది చిన్న చిన్న బోట్ల సాయంతో దానిని ఓ నౌకపైకి తీసుకొచ్చారు. రికవరీ వెస్సెల్‌ దాన్ని లిఫ్ట్‌ చేసిన తర్వాత క్యాప్సుల్‌ డోర్‌ను ఓపెన్‌ చేసి సునీతతో పాటు నలుగురు వ్యోమగాములను బయటకు తీసుకొచ్చారు. గత సంవత్సరం వీరు వెళ్లిన స్టార్‌ లైనర్‌ స్పేస్‌ షిప్‌లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయిన విషయం తెలిసిందే.

దీంతో తిరిగి రావడానికి 9 నెలల పాటు అంతరిక్షంలో వేచి ఉండాల్సి వచ్చింది. కాగా తాజాగా భూమిపై దిగిన వ్యోమగాములను హ్యూస్ట్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌కు తరలించారు. అక్కడే వారికి డాక్టర్ల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అంతరిక్షం నుంచి వచ్చిన నలుగురు వ్యోమగాములు ఆరోగ్యంగా ఉన్నారని నాసా తెలిపింది. అన్‌ డాకింగ్‌ నుంచి సాఫ్ట్‌ ల్యాండింగ్‌ వరకు అన్నీ అనుకున్నట్టు జరిగాయని వివరించింది. స్పేస్‌ ఎక్స్‌, నాసా సమిష్టి కృషితో వారిని భూమిపైకి తీసుకొచ్చామని తెలిపింది. ఈ యాత్రను సక్సెస్‌ చేయడంలో స్పేస్‌ఎక్స్‌ కీలక పాత్ర పోషించిందని నాసా ప్రశంసించింది.


Next Story