12 హిందూ దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు
Miscreants vandalise idols at 12 Hindu temples in Bangladesh. ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని ఉత్తర ఠాకూర్‌గావ్ జిల్లాలో
By అంజి Published on 6 Feb 2023 7:17 AM IST
ఆదివారం తెల్లవారుజామున బంగ్లాదేశ్‌లోని ఉత్తర ఠాకూర్‌గావ్ జిల్లాలో బలియాడంగీ పరిధిలోని 12 హిందూ దేవాలయాల్లోని 14 విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ దేవాలయాలు ఉపజిల్లాలోని దంతల, పరియా, చారుల్ యూనియన్‌లలో ఉన్నాయని బలియాడంగి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి ఖైరుల్ అనమ్ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
అదనపు చర్యలు తీసుకోబడ్డాయి
సబ్ డిస్ట్రిక్ట్ నిర్బాహి అధికారి బిపుల్ కుమార్ మాట్లాడుతూ.. మూడు యూనియన్‌లలోని దేవాలయాలు రోడ్డు పక్కన ధ్వంసం అయి ఉన్నాయని అన్నారు. "ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. మేము స్పాట్‌లను సందర్శించాము. డిప్యూటీ కమిషనర్, పోలీసు సూపరింటెండెంట్ కూడా దేవాలయాలను సందర్శించారు'' అని చెప్పారు. "మేము స్థానిక హిందూ సమాజంతో మాట్లాడాము. భయాందోళన చెందవద్దని వారిని కోరాము. అదనపు భద్రతా చర్యలు తీసుకోబడ్డాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని బిపుల్ కుమార్ అన్నారు.
చారుల్ యూనియన్ పరిషత్ ఛైర్మన్ దిలీప్ కుమార్ ఛటర్జీ కూడా ఈ సంఘటనను ధృవీకరించారు. "సమాచారం అందుకున్న వెంటనే, నేను ఉదయాన్నే సంఘటనా స్థలానికి చేరుకున్నాను. సంఘటన గురించి స్థానిక అధికారులకు తెలియజేసాను" అని ఆయన తెలిపారు. దంతల యూనియన్ పూజ ఉజ్జపోన్ కమిటీ ప్రధాన కార్యదర్శి జోతిర్మయ్ సింగ్ మాట్లాడుతూ.. యాభై ఏళ్లుగా ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నామని, ఇన్నేళ్లుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, విధ్వంసానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి అక్రమార్కులను వెలుగులోకి తెచ్చి ఆదర్శప్రాయంగా శిక్షించాలని డీసీ మహబూబుర్ రహమాన్ అన్నారు.