బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్‌

Microsoft co-founder Bill Gates tests positive for COVID-19.మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ కు క‌రోనా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 May 2022 2:18 PM IST
బిల్‌గేట్స్‌కు కరోనా పాజిటివ్‌

మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ కు క‌రోనా పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు మాత్ర‌మే ఉన్నాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్లు చెప్పారు. వైద్యుల సూచ‌న‌లు పాటిస్తున్న‌ట్లు చెప్పారు. బుధ‌వారం ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.

'నాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. స్వ‌ల్పస్థాయి ల‌క్ష‌ణాలు ఉన్నాయి. వైద్యుల సూచ‌న‌ల మేర‌కు పూర్తి ఆరోగ్యం సాధించే వ‌రుకు ఐసోలేష‌న్‌లో ఉంటాను. ఇప్ప‌టికే నేను కొవిడ్ టీకాలు తీసుకున్నాను. బూస్ట‌ర్ డోస్ కూడా వేయించుకున్నాను. అత్యుత్తమ వైద్య సేవ‌లు పొందే అవ‌కాశం ఉండ‌డం నా అదృష్టం' అని బిల్ గేట్స్ వ‌రుస ట్వీట్లు చేశారు.

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బిల్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ పలు పేద దేశాలకు వ్యాక్సిన్లు, ఔషధాలను అందజేసింది. అదేవిధంగా యాంటీవైరల్ జనరిక్‌ కరోనా పిల్స్‌ను సరఫరా చేసేందుకు తన ఫౌండేషన్ తరపున 120 మిలియన్ల డాలర్లను బిల్‌గేట్స్‌ వెచ్చించారు.

Next Story