ఘోర ప్ర‌మాదం.. కుప్ప‌కూలిన మెట్రో రైలు వంతెన.. 15 మంది మృతి

Mexico city rail overpass collapses.మెక్సికో న‌గ‌రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మెట్రో రైలు వంత‌న కుప్ప‌కూలింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 May 2021 11:27 AM IST
Metro train bridge

మెక్సికో న‌గ‌రంలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మెట్రో రైలు వంత‌న కుప్ప‌కూలింది. ఆ స‌మ‌యంలో ఆ మార్గంలో ప్ర‌యాణిస్తున్న రైలు వంతెన పై నుంచి కింద‌ప‌డింది. ఈ ప్ర‌మాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. 70 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో మెట్రో రైలు కింద ఉన్న ప‌లు వాహ‌నాలు కూడా దెబ్బ‌తిన్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన స్థానిక మీడియా ఛాన‌ల్స్ కొన్ని వీడియోల‌ను సైతం ప్రసారం చేస్తున్నాయి. ఈ ఘ‌ట‌న సోమవారం రాత్రి జ‌రిగిన‌ట్లు తెలిపాయి.

స‌మాచారం అందుకున్న అధికారులు, పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డికి చేరుకుని స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో కొంద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మాచారాన్ని అందుకున్న వెంట‌నే మెక్సికో సిటీ మేయ‌ర్ క్లాడియా షీన్‌బౌం ఘ‌ట‌నా స్థలాన్ని ప‌రిశీలించారు. ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అధికారుల‌ను అడిగితెలుస్తున్నారు. అగ్నిమాప‌క సిబ్బంది, ప్ర‌జా భ‌ద్ర‌తా సిబ్బంది స‌హాయ‌క చర్య‌లు చేప‌ట్టారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ఇప్ప‌టికే అన్ని ఆస్ప‌త్రుల‌తో మాట్లాడాం. ఈ ఘ‌ట‌న‌పై త్వ‌ర‌లోనే మ‌రింత స‌మాచారం ఇస్తామ‌ని ట్వీట్ చేశారు.



Next Story