కేఫ్‌లో గేమ్ ఆడుతూ యువకుడు మృతి..30 గంటలైనా పట్టించుకోని సిబ్బంది
లాంగ్ గేమింగ్ కోసం ఓ యువకుడు ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాడు.
By Srikanth Gundamalla Published on 3 July 2024 1:30 PM ISTకేఫ్‌లో గేమ్ ఆడుతూ యువకుడు మృతి..30 గంటలైనా పట్టించుకోని సిబ్బంది
లాంగ్ గేమింగ్ కోసం ఓ యువకుడు ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లాడు. గేమ్ ఆడుతూ ఆడుతూనే అనుకోని విధంగా ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. సిబ్బంది కూడా అతన్ని పట్టించుకోలేదు. నిద్రపోతున్నాడు అని వదిలేశారు. ఇక 30 గంటలు దాటిన తర్వాత ఒక వ్యక్తి యువకుడిని లేపేందుకు ప్రయత్నించాడు. యువకుడి శరీరం చల్లగా ఉండటంతో.. భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వచ్చిన పోలీసులు యువకుడు చనిపోయినట్లు నిర్ధారించారు. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జూన్ ఒకటో తేదీన 29 ఏళ్ల వ్యక్తి లాంగ్ గేమింగ్ సెషన్స్ కోసం ఇంటర్నెట్ కేఫ్ కు వెళ్లాడు. చాలా సేపు అతను గేమ్ ఆడుతూనే ఉన్నాడు. అతను గంటలు గడుస్తున్నా బయటకు రాకపోవడంతో కేఫ్ వర్కర్ ఒకరు వెళ్లి చూశాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడకు చేరుకున్న చనిపోయాడని నిర్ధారించిన తర్వాత వివరాలను సేకరించారు. అతను బ్రేక్ ఫాస్ట్ చేసినట్లుగా డెస్క్‌పై ఆనవాళ్లు ఉన్నాయి. జూన్ 2న లంచ్ కూడా చేయలేదు. ఉదయం అకస్మాత్తుగా మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మూసి ఉన్న గదిలో కూర్చున్నాడనీ. అందుకే త్వరగా గుర్తించలేకపోయామని కేఫ్ సిబ్బంది చెప్పారు. రెగ్యులర్‌గా సదురు వ్యక్తి కేఫ్‌కు వస్తుంటాడని చెప్పారు. ప్రతి సారి ఆరుగంటలకు పైగా గేమింగ్‌లో కూర్చుంటాడని తెలిపారు. నిద్రపోతున్నప్పుడు లేపొద్దనే ఉద్దేశంతోనే తాము దూరంగా ఉన్నట్లు కేఫ్ యజమాని చెప్పుకొచ్చాడు.