50 ఏళ్ల కిందట ఏలియన్స్ కిడ్నాప్ చేశారట..!

Man Allegedly Abducted By Aliens 50 Years Ago, Says They Told Him About The Covid Pandemic

By M.S.R  Published on  23 Feb 2022 9:32 AM GMT
50 ఏళ్ల కిందట ఏలియన్స్ కిడ్నాప్ చేశారట..!

ఒక మత్స్యకారుడు తనను "50 సంవత్సరాల క్రితం గ్రహాంతరవాసులు అపహరించారు" అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కోవిడ్-19 మహమ్మారి గురించి తనను హెచ్చరించారని కూడా అతడు చెబుతున్నాడు. కాల్విన్ పార్కర్ ఇప్పుడు తన వాదనలు నిజమవుతున్నాయని భయపడుతున్నట్లు ది మిర్రర్ నివేదించింది. అతను యుక్తవయసులో ఉన్నప్పుడు మిస్సిస్సిప్పిలోని పాస్కగౌలాలో ఒక నది ఒడ్డున UFO దిగిందని ఇప్పుడు 68 ఏళ్ల కాల్విన్ చెప్పాడు. అప్పుడు 19 ఏళ్ల వయసులో ఉన్న కాల్విన్.. తనను క్యారెట్ లాంటి ముక్కులు, ఎండ్రకాయల వంటి గోళ్లను కలిగి ఉన్న వింత జీవులు తనను, తన స్నేహితుడిని పట్టుకున్నాయని పేర్కొన్నాడు.

1973లో తన అపహరణ సమయంలో మానవజాతి భవిష్యత్తు గురించి భయంకరమైన సంఘటనలు తనకు చూపించబడ్డాయని పార్కర్ తెలిపాడు. మానవజాతి చాలా చెడ్డది అని దేవుడు మనకు గుణపాఠం చెప్పబోతున్నాడని అతడు వ్యాఖ్యానించాడు. మానవజాతి విశ్వాసాన్ని కోల్పోయింది మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఇష్టపడదని అన్నాడు. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తత నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం గురించి కూడా కాల్విన్ వ్యాఖ్యలు చేశాడు. తాను UFOలో ఉన్న సమయంలో నేను మరణానికి సమీపంలో ఉన్నానని అనిపించిందని వెల్లడించాడు. తన మీద ఎన్నో ప్రయోగాలు చేశారని.. గతం, భవిష్యత్తు అన్నీ తనకు చూపించారని కాల్విన్ చెబుతున్నాడు.

తనపై ఏలియన్స్ ప్రయోగం చేసినప్పటి నుండి తన ఆరోగ్యం క్షీణించిందని తెలిపాడు. నాకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కానీ నెమ్మదిగా నేను చాలా వాటిని అధిగమించాను. వారు చూపించినవి కొన్ని నిజం కావడాన్ని నేను చూడకపోతే.. ఇప్పుడు దాని గురించి మాట్లాడేవాణ్ణి కాదని అన్నాడు. ఏలియన్స్ నన్ను కిడ్నాప్ చేయడం.. నాకు శాపం అయి ఉండవచ్చు లేదా అది మన గ్రహం లేదా మానవాళిని రక్షించడంలో సహాయపడే మార్గం కావచ్చు. ఈ భూమిపై నా సమయం దాదాపుగా ముగిసిందని కూడా అంటున్నాడు.

Next Story