అమెరికాలో గాంధీజీ విగ్ర‌హం ధ్వంసం

Mahatma Gandhi's statue vandalised in New York.అమెరికాలో గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. న్యూయార్క్‌ నగరంలోని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Feb 2022 4:14 PM IST
అమెరికాలో గాంధీజీ విగ్ర‌హం ధ్వంసం

అమెరికాలో గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం చేశారు. న్యూయార్క్‌ నగరంలోని మాన్‌హాటన్ యూనియన్ స్క్వేర్‌లోని 8 అడుగుల గాంధీ కాంస్య విగ్రహాన్ని శ‌నివారం కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు ధ్వంస చేశారు. ఈ ఘ‌ట‌న‌ను కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. నీచ‌మైన చ‌ర్య‌గా అభిప్రాయ‌ప‌డింది. గాంధీ విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేసింది.

బాపూజీ 117వ జయంతిని పురస్కరించుకుని 1986 అక్టోబ‌ర్ 2న ఈ విగ్ర‌హాన్ని గాంధీ స్మారక అంతర్జాతీయ ఫౌండేషన్ విరాళంగా ఇచ్చింది. అయితే.. 2001లో కొన్ని కార‌ణాల‌తో ఈ విగ్ర‌హాన్ని తొల‌గించ‌గా.. 2002లో మ‌ళ్లీ పున‌రుద్ద‌రించారు. గాంధీ విగ్ర‌హాం పై జ‌రిగిన దాడిని అమెరికాలోని భార‌తీయులు ఖండించారు. శాంతి, అహింసా మార్గాల‌ను ఆధునిక ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన మ‌హాత్ముడి విగ్ర‌హాన్ని దుండ‌గులు ల‌క్ష్యంగా చేసుకోవ‌డం విచార‌క‌ర‌మ‌ని అమెరికాలోని భారతీయ సంఘాల సమాఖ్య ఛైర్మన్‌ అంకుర్‌ వైద్య అన్నారు.

ఇక అమెరికాలో గాందీ విగ్ర‌హాల‌పై దాడులు జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జనవరిలో కాలిఫోర్నియాలోని ఓ పార్కులో ఉన్న విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. డిసెంబర్ 2020లో జరిగిన మరో సంఘటనలో.. ఖలిస్తానీ-మద్దతుదారులు వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం ముందు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

Next Story