సీసీ కెమెరాలో రికార్డైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు

కెనడాలో 68 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సహసి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నానని చెబుతూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అనుసంధానించిన ఖాతాలో సోషల్ మీడియా పోస్ట్ కనిపించింది.

By -  Medi Samrat
Published on : 29 Oct 2025 9:20 PM IST

సీసీ కెమెరాలో రికార్డైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు

కెనడాలో 68 ఏళ్ల భారత సంతతి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సహసి హత్య జరిగిన కొన్ని గంటల తర్వాత, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నానని చెబుతూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో అనుసంధానించిన ఖాతాలో సోషల్ మీడియా పోస్ట్ కనిపించింది.

బిష్ణోయ్ సిండికేట్‌కు చెందిన ప్రసిద్ధ సహచరుడు గోల్డీ ధిల్లాన్ ఆ పోస్ట్ పెట్టాడు. దర్శన్ సింగ్ మాదకద్రవ్యాల వ్యాపారంలో పాల్గొన్నాడని ఆరోపించింది. డబ్బును చెల్లించడానికి నిరాకరించి, మా నంబర్‌ను బ్లాక్ చేయడంతో తాము ప్రతీకారం తీర్చుకున్నామని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో దర్శన్ తన నివాసం బయట పార్క్ చేసిన కారులో కూర్చుని ఉండగా, ఒక దుండగుడు ముదురు రంగు దుస్తులు ధరించి వాహనం వైపు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో అనేక రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుండి నిందితుడు పారిపోయాడు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, కెనడియన్ పోలీసులు ఈ హత్యను లక్ష్యంగా చేసుకుని పాల్పడిన దాడిగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు అధికారులు ముఠా ఆన్‌లైన్ వాదనను సమీక్షిస్తున్నారు, సోషల్ మీడియా పోస్ట్ ప్రామాణికతను పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం CCTV ఫుటేజ్‌ను విశ్లేషిస్తున్నారు.

Next Story