కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూన్‌ 12 బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  12 Jun 2024 4:15 PM IST
kuwait, fire accident,  building, 41 deaths,

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం, 41 మంది మృతి

కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జూన్‌ 12 బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాద సంఘటనలో 41 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు భారతీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు.

కువైట్‌లోని దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లోని మంగాఫ్‌ నగరంలో తెల్లవారుజామున ఉదయం 4 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 160 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇక మంటలు చెలరేగిన వెంటనే స్థానికులు అగ్నిప్రమాద సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు కూడా శరవేగంగా అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేసే ప్రయత్నం చేశారు. ఇక భవనంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ.. 41 మంది సజీవ దహనం అయ్యారని అధికారులు చెప్పారు. కాగా.. ప్రాదం ఎలా జరిగిందనే దానిపై క్లరాఇటీ లేదని అన్నారు.

ఈ ప్రమాద సంఘటనపై అగ్నిప్రమాద సిబ్బంది మాట్లాడుతూ.. ఘటన తర్వాత చాలా మందిని కాపాడామని చెప్పారు. దురదృష్టవశాత్తు మంటల ధాటికి పొగ పీల్చడం వల్ల పలువురు చనిపోయారని అన్నారు. కువైట్‌లో జరిగిన ప్రాదంపై కేంద్ర మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి ఇండియా రాయబారి వెళ్లారన్నారు. ప్రాణాలు కోల్పోయిన భారత్‌కు చెందిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు కేంద్రమంత్రి జైశంకర్ చెప్పారు.

Next Story