కొరియన్ పాప్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త.. మూన్ బిన్ మృతి

K-పాప్ స్టార్ మూన్‌బిన్ మరణించాడు. బాయ్ బ్యాండ్ "ఆస్ట్రో" లో భాగమైన అతడు చనిపోయినట్లు దక్షిణ కొరియా పోలీసులు గురువారం

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 20 April 2023 10:30 AM IST

K-Pop Star Moonbin, Moonbin Fans, Seoul

కొరియన్ పాప్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న వార్త.. మూన్ బిన్ మృతి

K-పాప్ స్టార్ మూన్‌బిన్ మరణించాడు. బాయ్ బ్యాండ్ "ఆస్ట్రో" లో భాగమైన అతడు చనిపోయినట్లు దక్షిణ కొరియా పోలీసులు గురువారం తెలిపారు. ఈ మరణ వార్త విన్న అభిమానులు తమ బాధను వ్యక్త పరుస్తూ ఉన్నాడు. 25 ఏళ్ల గాయకుడు బుధవారం అర్థరాత్రి దక్షిణ సియోల్‌లోని అతని ఇంటిలో చనిపోయి కనిపించాడని.. పోలీసులు AFP కి చెప్పారు. మూన్‌బిన్ లేబుల్ ఫాంటాజియో మ్యూజిక్ కూడా అతని మరణాన్ని ధృవీకరిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది, కానీ ఎలా చనిపోయాడనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

మూన్‌బిన్‌గా ఆస్ట్రో సమూహంలో సభ్యుడు. మూన్‌బిన్, సన్హా అనే సబ్ గ్రూప్ ల ద్వారా కూడా అతడు ప్రదర్శన ఇచ్చారు. అతను చిన్న వయస్సులోనే ఫాంటాజియో ట్రైనీ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఫిబ్రవరి 2016లో ఆస్ట్రోతో కెరీర్ ను మొదలుపెట్టాడు. మూన్‌బిన్ ఈ ఏడాది పలు కాన్సర్ట్‌లలో ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని గతంలో చెప్పాడు. కానీ ఊహించని విధంగా అతడు ప్రాణాలను విడిచిపెట్టాడనే వార్త కొరియన్ పాప్ ప్రపంచాన్ని కుదిపేసింది.

Next Story