మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో సింగిల్ డోస్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్..!

Jhonson & jhonson 3rd phase vaccine trial. భారత్ లో 'సింగిల్ డోస్' కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని కోరుతూ అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది.

By Medi Samrat  Published on  20 April 2021 12:10 PM GMT
J&J DCGI

ప్రస్తుతం కరోనా మహమ్మారిని అంతం చేయడానికి ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవన్నీ రెండు డోస్ లు వేసుకోవాల్సిందే..! అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ మాత్రం సింగిల్ డోస్ మీద దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే చాలా దేశాల్లో ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు అనుమతులు వచ్చేసాయి. త్వరలో భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ కు అనుమతులు రాబోతున్నాయని అంటున్నారు. భారత్ లో 'సింగిల్ డోస్' కరోనా వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని కోరుతూ అంతర్జాతీయ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ దరఖాస్తు చేసింది.

దాంతో పాటు వ్యాక్సిన్ దిగుమతి లైసెన్స్ కూ అనుమతి కోరింది. దీనిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీని విజ్ఞప్తి చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ను ఒక్క డోసు ఇస్తే సరిపోతుంది. 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మూడు నెలల పాటు నిల్వ ఉంచొచ్చని సంస్థ చెబుతోంది. విదేశీ వ్యాక్సిన్లకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉండడంతో జాన్సన్ అండ్ జాన్సన్ మూడో ఫేజ్ ట్రయల్స్ కు దరఖాస్తు చేసుకుంది.

కేంద్ర ప్రభుత్వం రష్యా నుంచి స్పుత్నిక్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోడానికి కూడా సిద్ధమైంది. మరో 10 రోజుల్లో స్పుత్నిక్ వ్యాక్సిన్ మన దేశానికి రాబోతోంది. ఈ టీకా ఇండియాలో కూడా తయారుకాబోతోందని ప్రతి నెలా 5 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తామని అంటున్నారు.

స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ టీకా ఇండియా-రష్యా వ్యాక్సిన్ గా మారుతుందని, రష్యా కంటే ఇండియాలోనే వ్యాక్సిన్ ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుందని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ తెలిపారు. ఐదు భారతీయ ఫార్మా కంపెనీలు తమ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తాయని చెప్పారు. స్పుత్నిక్ టీకా 97.6 శాతం పని చేస్తున్నట్టు గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.


Next Story