రక్తం గడ్డకటి యువకుడి మృతి.. టీకా పంపిణీ నిలిపివేత..!
Italy halts AstraZeneca vaccine for under 60s.కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2021 7:26 AM ISTకరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లపై ఆరోపణలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇటలీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అరవై ఏళ్ల లోపు వయసున్న వారికి ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన టీకా ఇవ్వబోమని ప్రకటించింది. ఈ టీకా పంపిణీని నిలిపివేస్తున్నామని తెలిపింది.
ఇటలీలో ఆక్సఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకాతో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. మే 25న ఈ టీకా తీసుకున్న 18 ఏళ్ల కెమిల్లా కనేపా అనే యువకుడు రక్తం గడ్డ కట్టి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఇటలీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇకపై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని కూడా నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అత్యంత అరుదుగా మాత్రమే సంభవించే ఈ రుగ్మత కారణంగా అతను మరణించాడు. 60ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. ఇక.. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా టీకా తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసు కింద మరో టీకా ఇస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఆస్ట్రాజెనెకా టీకా కారణంగా రక్తం గడ్డకడుతాయన్న అనుమనాంతో ముందుగా జాగ్రత్తగా పలు దేశాలు ఇప్పటికే ఈ టీకా పంపిణీని తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.