హమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ మహిళా సైనికులు రిలీజ్
By Knakam Karthik Published on 25 Jan 2025 5:06 PM ISTహమాస్ చెర నుంచి ఇజ్రాయెల్ మహిళా సైనికులు రిలీజ్
గాజాలో 15 నెలల నాటి యుద్ధాన్ని ముగించే ప్రక్రియలో మరో నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను హమాస్ విడుదల చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దాదాపు 200 మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఒప్పందం కుదుర్చుకుంది. నలుగురు మహిళా సైనికులు కరీనా అరివ్, డానియెలా గిల్బోవా, నామా లేవీ, లిరి అల్బాగ్‌లను గాజాలోని రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. AFP ప్రకారం వారిని ఇజ్రాయెల్ సైనిక దళాలకు అప్పగించారు.
Hamas are psychopaths. Our returning hostages are heroines. pic.twitter.com/SmADrl7CZL
— Eylon Levy (@EylonALevy) January 25, 2025
ప్రస్తుతం విడుదలైన వారు మహిళా సైనికులు కాగా, గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వారికి అక్టోబర్ 27న హమాస్ బంధించి తీసుకెళ్లింది. 477 రోజులుగా వారు ఆ గ్రూప్ చెరలోనే ఉండిపోయారు. తాజాగా ఆ నలుగురిని మిలిటరీ యూనిఫామ్‌లో తీసుకువచ్చి రెడ్ క్రాస్‌కు అప్పగించారు.
కాల్పుల విరమణ అగ్రిమెంట్ ప్రకారం మొదటి ఆరు వారాల దశలో, ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న వందలాది మంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, రోగులు, గాయపడిన వారితో పాటు 33 మంది బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ దళాలు కొంతమంది నుండి వెనక్కి తగ్గాయి.
కాల్పుల విరమణ ప్రారంభమైన తొలిరోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్..100కుపైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 41రోజుల తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికిపైగా పాలస్తీనియులకు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విముక్తి కల్పించనుంది.