హమాస్‌ చారిత్రక తప్పు చేసింది..యుద్ధాన్ని మేం ముగిస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని

హమాస్‌ దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  10 Oct 2023 6:27 AM GMT
israel, prime minister, hamas,  war,

 హమాస్‌ చారిత్రక తప్పు చేసింది..యుద్ధాన్ని మేం ముగిస్తాం: ఇజ్రాయెల్ ప్రధాని

ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో వందల సంఖ్యలో ఇజ్రాయెల్‌ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వేల సంఖ్యలో సామాన్యులు గాయపడ్డారు. ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేస్తున్న దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. అక్కడి ప్రజల పరిస్థితులు తెలుసుకున్న ప్రతి ఒక్కరి మనసు కదిలిస్తోంది. కుటుంబ సభ్యులను కళ్ల ముందే వధించడం.. వేడుకల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలపై ఆవేదనలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే.. హమాస్‌ దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహు స్పందించారు. హమాస్‌ ఉగ్రవాదుల దాడులను ఖండిస్తున్నట్లు చెప్పారు. తాము యుద్ధాన్ని కోరుకోలేదని అన్నారు. అయితే.. తాము యుద్ధం మొదలు పెట్టలేదు కానీ.. ముగింపు మాత్రం తామే పలుకుతామని హెచ్చరించారు. ప్రస్తుతం దేశమంతా యుద్ధం చేస్తోందని.. దీన్ని తాము ఏమాత్రం కోరుకోలేదని వ్యాఖ్యానించారు. తప్పని పరిస్థితుల్లో దేశాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో మాత్రమే తాము యుద్ధం బాట పట్టాల్సి వస్తోందిన ప్రధాని నెతన్యాహు అన్నారు. అయితే.. తాము యుద్ధం మొదలుపెట్టలేదు కానీ.. తప్పకుండా తామే ముగిస్తామంటూ హమాస్‌కు వార్నింగ్ ఇచ్చారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు. తాము తిరిగి ఇచ్చే సమాధానం హమాస్‌తో పాటు.. ఇజ్రాయెల్‌ శత్రు దేశాలకు అన్నింటికీ గుర్తిండిపోతుందని ఉద్ఘాటించారు. అయితే.. హమాస్‌ కూడా ఐసిస్‌ లాంటి ఉగ్రవాద సంస్థ అని దాన్ని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలుపు నాగరిక ప్రపంచం మొత్తానికి గెలుపు అని ఇజ్రాయెల్ ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా తమకు మద్దతు తెలిపిన దేశాలకు ఇజ్రాయెల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. హమాస్‌పై ప్రతీకార దాడుల్లో బాగంగా ఇజ్రాయెల్ 3లక్షల మంది సైనికులను సమీకరించింది. 1973 తర్వాత ఈ స్థాయిలో సైన్యాన్ని మోహరించడం ఇదే మొదటిసారి అని అక్కడి జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. 1973లో ఏకంగా 4లక్షల మంది సైనికులను మోహరించి ఇజ్రాయెల్. దాంతో.. యుద్ధం భీకరంగా ఉండబోతుందని అర్థం అవుతోంది. మున్ముందు ఇంకెలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

Next Story