ఇరాన్ క్షిపణి దాడులను దృష్టిలో ఉంచుకుని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు కీలక సూచనను జారీ చేసింది. భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు సూచించిన విధంగా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని సలహాను ఇచ్చింది.
"దయచేసి జాగ్రత్తగా ఉండండి, అనవసర ప్రయాణాలను నివారించండి. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. భారతీయుల భద్రతను నిర్ధారించడానికి ఇజ్రాయెల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది" అని జాగ్రత్తలు తెలిపింది. అత్యవసర సమయాల్లో +972-547520711, +972-543278392 ఈ నెంబర్లను సంప్రదించాలని సూచించింది.
ఇజ్రాయెల్ దళాలు జరిపిన వరుస హత్యలకు ప్రతీకారంగా ఇరాన్ మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇస్మాయిల్ హనియే, సయ్యద్ హసన్ నస్రల్లా, నిల్‌ఫోరూషన్‌ల హత్యలకు ప్రతిస్పందనగా దాడులు చేస్తామని ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక ప్రకటనలో పేర్కొంది.