గాజా అటాక్‌లో ముగ్గురు ముఖ్య హమాస్ లీడర్ల హతం, ఇజ్రాయెల్ ప్రకటన
హమాస్‌కు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది.
By Srikanth Gundamalla Published on 3 Oct 2024 12:30 PM GMTNext Story
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు చెందిన ముగ్గురు సీనియర్ నాయకులను హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. మూడు నెలల క్రితం జరిగిన దాడిలో ముగ్గురు హమాస్ సీనియర్ నేతలు మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ పేర్కొన్నది. అందులో తమ గాజా ప్రభుత్వ అధిపతి రౌహీ ముష్తాహా కూడా ఉన్నారు.
గాజాలో జరుగుతున్న పోరులో గత ఏడాది నుంచి పాలస్తీనా ఆపరేటివ్స్‌తో ఇజ్రాయిల్ యుద్ధం సాగిస్తున్నది. మూడు నెలల క్రితం జరిగిన గాజా దాడిలో ముగ్గురు హమాస్ సీనియర్ నేతలు మరణించినట్లు ఇజ్రాయిల్ మిలిటరీ ఇవాళ పేర్కొన్నది. ఉత్తర గాజాలోని భూగర్భ సమ్మేళనంపై జరిగిన దాడిలో రావి ముష్తాహ తో పాటు మరో ఇద్దరు హమాస్ కమాండర్లు సమేహ్ సిరాజ్, సమేహ్ ఔదేహ్ మరణించారని IDF తెలిపింది. హమాస్ నుండి దీనిపై ఎలాంటి స్పందన ఇప్పటి వరకు అయితే లేదు.
హమాస్‌లో ముష్తాహ .. సీనియర్ ఆపరేటివ్‌గా ఉన్నాడు. హమాస్ ఫోర్స్‌కు చెందిన నిర్ణయాలను ఆయనే తీసుకునేవారు. హమాస్ టాప్ లీడర్ యాహ సిన్వార్‌కు రైట్ హ్యాండ్‌గా ముష్తాహను గుర్తించారు. 2015 నుంచి ముష్తాహ ను గ్లోబల్ ఉగ్రవాదిగా అమెరికా ప‌్రకటించింది. హమాస్ పోలిట్‌బ్యూరో సభ్యుడిగా సిరాజ్, అంతర్గత సెక్యూర్టీ ఏజెన్సీ నేతగా ఓదేహ్ ఉన్నట్లు ఈసీఎఫ్ఆర్ పేర్కొన్నది. ఉత్తర గాజాలో భూగర్భ సమ్మేళనంలో దాక్కున్నప్పుడు IAF ఫైటర్ జెట్‌లు దాడి చేసి వారిని అంతం చేశాయని IDF పోస్ట్‌లో తెలిపింది.