సేవా కార్యక్రమాలు నిర్వహించే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్(ఇస్కాన్)ను బంగ్లాదేశ్ పోలీసులు ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం సంచలనంగా మారింది. దేశంలో మతపరమైన హింసకు ఇస్కాన్ సభ్యులు తెరతీస్తున్నారని, భారత నిఘా సంస్థ 'రా'కు అనుబంధంగా పని చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇస్కాన్ సభ్యుడు, ఆధ్యాత్మిక వేత్త చిన్మోయ్ కృష్ణదాస్‌పై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది.
ఇస్కాన్.. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 'రా' కోసం పని చేస్తోందని, ఇది తప్పక నిషేధించబడాలని బంగ్లాదేశ్ బెంగాలీ దినపత్రిక అయిన అమర్ దేశ్ యజమాని మహముదుర్ రెహమాన్ అన్నారు. అయితే అనేక విపత్తల్లో బంగ్లా ప్రజలకు ఇస్కాన్ అండగా నిలవడం కొసమెరుపు. కాగా కొన్ని నెలల క్రితం మాజీ ప్రధాని షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో ప్రజలు తిరుగుబాటు చేయడంతో భారత్‌కు వచ్చి తలదాచుకున్న విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి బంగ్లాలో హిందువులు, ఆలయాలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. దాడులతో పాటు ఆలయాల ధ్వంసం, దోపీడీలు పెరిగిపోయాయి.
ఇస్కాన్ బంగ్లాదేశ్ నాయకులు బంగ్లాదేశ్ ఓడరేవు నగరం చిట్టగాంగ్‌లోని హజారీ గోలీ ప్రాంతంలో దాడి, విధ్వంసం వంటి అవాంఛనీయ సంఘటనల నేపథ్యంలో తమ సంస్థకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వివిధ మార్గాల్లో వ్యాప్తి చేయడంపై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలి హింసాత్మక సంఘటనల దృష్ట్యా , ఇస్కాన్ బంగ్లాదేశ్‌ను వివిధ మార్గాల్లో ప్రమేయం చేయడం ద్వారా మన మతపరమైన , సామాజిక ప్రతిష్టను దెబ్బతీసే నిందలు ఉన్నాయి " అని ఇస్కాన్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు సత్య రంజన్ బరోయ్ ఢాకాలో ఒక వార్తా సమావేశంలో అన్నారు.