వామ్మో.. ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ..!
Is Omicron Variant Connected With Untreated HIV.గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్
By తోట వంశీ కుమార్ Published on 22 Dec 2021 8:43 AM ISTగత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్ కంటే మూడు నుంచి ఆరు రెట్ల వేగంతో ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచదేశాల్లో మరోసారి కలవరం మొదలైంది. దీంతో చాలా దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని చోట్ల లాక్‌డౌన్‌ను సైతం అమలు చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రెండు డోసుల టీకా తీసుకున్న వారిని సైతం ఒమిక్రాన్ వదలడం లేదు. దీంతో ఈ మహమ్మారికి ఇంత శక్తి ఎలా వచ్చింది..? బలహీన పడిందనుకున్న కరోనా.. రూపాంతరం చెంది ఒమిక్రాన్‌గా ఎలా మారింది..? అన్న ప్రశ్నలను తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్న దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఓ షాకింగ్ విషయాలను చెప్పారు. ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందని ప్రాథమికంగా నిర్థారించారు.
దక్షిణాఫ్రికాలో 18 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీతో బాధపడుతున్నారని, ప్రపంచ హెచ్ఐవీ కేంద్రంగా ఆదేశం మారిందని గతేడాది ఐరాస దేశాల హెచ్ఐవీ, ఎయిడ్స్ సంయుక్త నియంత్రణ కార్యక్రమం యూఎస్ఎయిడ్స్ ఓ నివేదిక ఇచ్చింది. వీరిలో చాలా మంది ఎలాంటి మందులు వాడటం లేదని తెలిపింది. ఇలాంటి వారిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనపడి.. ఇతరత్రా వ్యాధలకు ఆలవాలంగా మారుతుందని చెప్పింది.
సరిగ్గా ఇలాంటి మహిళే.. ఒకరు కరోనా బారిన పడిందన్నారు శాస్త్రవేత్తలు. ఆమె శరీరంలోని హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా మారిందని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు.పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు కూడా వీరి వాదనతో ఏకీభవిస్తున్నారు. తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించింది దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలే కావడం గమనార్హం.