బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది పర్వతారోహకులు మృతి

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది.

By Srikanth Gundamalla
Published on : 4 Dec 2023 4:13 PM IST

indonesia, volcano erupted, 11 climbers died,

బద్దలైన అగ్నిపర్వతం, 11 మంది పర్వతారోహకులు మృతి

ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఓ అగ్నిపర్వతం బద్దలైంది. సమత్రా దీవిలో మౌంట్‌ మరపిలో అగ్నిపర్వతం ఉంది. ఇదే విస్ఫోటనం చెందింది. ఈ సంఘటనలో 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది ఆచూకీ తెలియడం లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అగ్నిపర్వతం బద్దలవ్వడంతో.. దాని నుంచి వెలువడ్డ బూడిత ఆకాశంలో దాదాపు 3వేల మీటర్ల ఎత్తు వరకు వ్యాపించిందని స్థానిక అధికారులు చెప్పారు.

అగ్నిపర్వతం బద్దలైన విషయం.. అంతేకాక.. అక్కడ కొందరు చిక్కుకున్నారనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు వెంటనే అప్రమత్తం అయ్యాయి. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. వారిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. అయితే.. తాము రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఇప్పటి వరకు 45 మందిని కాపాడామని చెప్పారు. కానీ.. మరో 12 మంది ఆచూకీ మాత్రం తెలియడం లేదన్నారు. అయితే.. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

ఇండోనేషిలో అగ్నిపర్వతం విస్పోటనం ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆ దేశ నాయకులు అంటున్నారు. అయితే.. గల్లంతైనవారి కోసం గాలింపు కొనసాగించాలని కోరుతున్నారు.

Next Story