అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

Indianapolis FedEx shooting.అమెరికాను తుపాకీ హింస కుదిపేస్తోంది. మానసిక సంఘర్షణ కారణం గా హింస కు పాల్పడుతున్నవారు ఎక్కువైపోయారు. తాజాగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 April 2021 2:11 AM GMT
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

అమెరికాను తుపాకీ హింస కుదిపేస్తోంది. మానసిక సంఘర్షణ కారణం గా హింస కు పాల్పడుతున్నవారు ఎక్కువైపోయారు. తాజాగా మరోసారి కాల్పులు చాలారేగాయి. గురువారం రాత్రి ఇండియానాపోలిస్‌లోని ఫెడెక్స్‌ కార్యాలయంలోని పార్కింగ్‌ ప్రదేశంలో గుర్తు తెలియని ఓ సాయుధుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపి ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడు. తర్వాత తానూ కాల్చుకొని చనిపోయాడు. గాయాలతో ఐదుగురు ఆస్పత్రిలో చేరారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తుల్లో భారత సంతతికి చెందిన ఓ యువతి కూడా ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి గతంలో ఫెడెక్స్ లో పనిచేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మారణ హోమాన్ని సృష్టించిన వ్యక్తి తెల్లజాతీయుడు కావడం, మరణించిన వాళ్ళు నల్లజాతీయులు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫెడెక్స్‌ కేంద్రంలో దాదాపు 4,500కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమేటిక్‌ మెషిన్‌ గన్‌తో సాయుధుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

గత కొద్ది రోజులలోనే అమెరికాలో పలు మార్లు కాల్పులు జరిగాయి. గత నెల చివరిలో, దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ కార్యాలయ భవనంలో ఒక పిల్లవాడితో సహా నలుగురిని కాల్చి చంపారు. మార్చి 22 న కొలరాడోలోని బౌల్డర్‌లోని కిరాణా దుకాణం వద్ద జరిగిన కాల్పుల్లో 10 మంది మరణించారు. మార్చి మొదతి వారంలో జార్జియాలోని అట్లాంటాలో స్పాస్‌లో ఒక వ్యక్తి ఆసియా సంతతికి చెందిన ఆరుగురు మహిళలతో సహా ఎనిమిది మందిని కాల్చి చంపిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. అమెరికాలో యేటా దాదాపు 40,000 మంది తుపాకుల వల్ల మరణిస్తున్నారు, వారిలో సగానికి పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.




Next Story