ఆఫ్ఘనిస్తాన్ కు మరోసారి సాయం చేసిన భారత్

India supplies next batch of humanitarian assistance to Afghanistan.ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ మరోసారి సహాయం అందించింది.

By M.S.R  Published on  1 Jan 2022 8:55 PM IST
ఆఫ్ఘనిస్తాన్ కు మరోసారి సాయం చేసిన భారత్

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ మరోసారి సహాయం అందించింది. భారత్ తాజాగా 5 లక్షల కోవాక్సిన్ డోసులను సరఫరా చేసింది. గతంలో కూడా వ్యాక్సిన్ డోసులను అందచేసిన భారత్ మరోసారి వ్యాక్సిన్లు అందించి అండగా నిలిచింది. వ్యాక్సిన్ డోసులను కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మరో 5,00,000 డోసుల అదనపు వ్యాక్సిన్‌ను రాబోయే వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఆహార ధాన్యాలు, ఒక మిలియన్ డోస్ కోవిడ్ వ్యాక్సిన్లు, ప్రాణాలను రక్షించే మందులను మానవతా సహాయం కింద ఆఫ్ఘన్ ప్రజలకు అందించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి తెలిపింది. గత నెల ప్రారంభంలో, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ద్వారా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు వైద్య సహాయాన్ని అందించింది. "రాబోయే వారాల్లో, మేము గోధుమల సరఫరా, మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాము. ఈ విషయంలో, రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి మేము UN ఏజెన్సీలు ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నాము, "అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆఫ్ఘన్ ప్రజలకు ఆహార ధాన్యాలు మరియు అవసరమైన మందులను కూడిన అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 'గత నెలలో 1.6 టన్నుల మెడికల్ ఎక్విప్ మెంట్ పంపించాం. రాబోయే వారాల్లో గోధుమల సరఫరా మరియు మిగిలిన వైద్య సహాయాన్ని చేపట్టనున్నాం. ఈ విషయంలో రవాణాకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయడానికి ఐక్యరాజ్యసమితితో సంప్రదింపులు జరుపుతున్నాం' అని భారత్ తెలిపింది.

Next Story