కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి.
By - Knakam Karthik |
కీలక మలుపు తీసుకున్న భారత్–అఫ్గానిస్తాన్ సంబంధాలు
భారత్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కీలక మలుపు తీసుకున్నాయి. అఫ్గానిస్తాన్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలను భారత్ పునరుద్ధరించింది. ఈ మేరకు ప్రస్తుతం కాబూల్‌లో ఉన్న భారత మిషన్‌ను ప్రభుత్వం ‘ఫుల్ ఎంబసీ స్టేటస్’ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. తాలిబాన్ పాలన ప్రారంభమైన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాల్లో ముఖ్యమైన మలుపు తీసుకుంది.
2021లో తాలిబాన్ కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే తన రాయబార కార్యాలయాన్ని భారత్ మూసివేసి సిబ్బందిని వెనక్కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భద్రతా పరిస్థితులు కొంత స్థిరంగా ఉన్నాయని, భారత ప్రయోజనాల రక్షణ, అభివృద్ధి ప్రాజెక్టుల పునరుద్ధరణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో అఫ్గానిస్తాన్‌లో భారత పెట్టుబడులు, పునర్నిర్మాణ ప్రాజెక్టులకు ఊతం ఇస్తుందని పేర్కొంది. దౌత్య సంబంధాల పునరుద్ధరణతో ఆసియా భూభాగంలో భారత్ వ్యూహాత్మక ఉనికి బలపడే అవకాశం ఉంది.