మళ్లీ పెరుగుతున్న కేసులు - ఇద్దరు మేయర్ల డిస్మిస్

By -  Nellutla Kavitha |  Published on  12 March 2022 4:43 PM GMT
మళ్లీ పెరుగుతున్న కేసులు - ఇద్దరు మేయర్ల డిస్మిస్

చైనాలో మళ్లీ మెల్లిమెల్లిగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతోంది. మెయిన్ల్యాండ్ చైనాలో 1524 లో లోకల్లి transmited కరోనా వైరస్ కేసులు బయటపడ్డయని జాతీయ హెల్త్ కమిషన్ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలోనే 1100 కేసుల నుంచి 1524 కేసులకు పెరిగినట్టుగా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. వారం క్రితం అక్కడ కేవలం 100 కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో చైనా మళ్లీ అప్రమత్తమైంది. చైనా ఈశాన్య ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు మేయర్ లను చైనా డిస్మిస్ చేసింది. ఇక షాంఘైలో స్కూల్స్ ని మూసివేసి ఆన్లైన్ క్లాసులు ని స్టార్ట్ చేశారు. రోజురోజుకు చైనాలో పెరుగుతున్న కేసులు సరికొత్త ఛాలెంజ్ క్రియేట్ చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం చైనా జీరో కేసుల లక్ష్యంగా పని చేసింది. ఇక కొన్ని నెలల క్రితం తన వ్యూహాన్ని మార్చుకుని, డైనమిక్ జీరో కేంద్రంగా పనిచేస్తోంది. చాంగ్ చున్ నగరానికి చెందిన జిలిన్, జుతాయి జిల్లాల మేయర్ లను ఈరోజు డిస్మిస్ చేశారు. జిలిన్ లో 1.8 మిలియన్ల జనాభా ఉంటే, జుతాయి రూరల్ జిల్లా. 9 మిలియన్ల జనాభా ఉన్న చాంగ్ చున్ లో పాక్షిక లాక్ డౌన్ విధించారు. ఇంటికి ఒకరు మాత్రమే రెండు రోజులకు ఒకసారి బయటికి వెళ్లి సరుకుల్ని తెచ్చుకోవాలి. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో సగానికి పైగా ఎలాంటి లక్షణాలు లేవని, దీనికి ప్రధాన కారణం 90 శాతానికి పైగా అందరూ వ్యాక్సిన్లను తీసుకోవడమే అంటున్నారు అక్కడి అధికారులు.

Next Story