ఇమ్రాన్ ఖాన్ కు ఏమైందో..

Imran khan twitter account .. సాధారణంగా ఎవరి మీదైనా కోపం వస్తే సామాజిక మాధ్యమాల్లో అన్ ఫాలో చేస్తూ ఉండడాన్ని మనం

By సుభాష్  Published on  9 Dec 2020 1:53 AM GMT
ఇమ్రాన్ ఖాన్ కు ఏమైందో..

సాధారణంగా ఎవరి మీదైనా కోపం వస్తే సామాజిక మాధ్యమాల్లో అన్ ఫాలో చేస్తూ ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఏమైందో కానీ అందరినీ అన్ ఫాలో చేసేశారు. చివరికి తన మాజీ భార్యలను కూడా ఆయన అన్ ఫాలో చేయడాన్ని గమనించవచ్చు. ఇమ్రాన్ ఖాన్ కు ప్రస్తుతం 12.9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. కానీ ఆయన మాత్రం ఒక్కరిని కూడా ఫాలో అవ్వడం లేదు. ఇంతకు ముందు ఫాలో అవుతున్న అందరినీ అన్ ఫాలో చేసేశాడు ఇమ్రాన్ ఖాన్.

2010లో ట్విటర్‌ ఖాతా తెరిచిన ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాక్టివ్‌గా ఉంటున్నాడు. తమ ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసేవాడు. అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి తన మొదటి భార్యతో సహా అందరిని అన్‌ఫాలో చేశారు. ఇమ్రాన్‌ తొలుత బ్రిటిష్‌ జర్నలిస్టు జెమీమాను ఇమ్రాన్‌ పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకుని‌.. మరో జర్నలిస్టు రేహమ్‌ను(2015) లో రెండో పెళ్లి చేసుకున్నారు. 10 నెలలు కూడా ఆ బంధం నిలబడలేదు. తర్వాత బుష్రాను ఆయన మూడో పెళ్లి చేసుకున్నారు.

ఇలా అందరినీ అన్ ఫాలో చేయడంతో ఇమ్రాన్ ఖాన్ ను ట్రోల్ కూడా చేస్తున్నారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఇమ్రాన్‌ అనుసరిస్తున్నారని.. నవాజ్‌ షరీఫ్‌ ఎవరినీ ఫాలో అవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించి తానేమీ తక్కువ కాదు కదా అనుకుని అందరినీ అన్‌ఫాలో చేశాడని అంటున్నారు.

Next Story