సూయజ్ కాల్వలో చిక్కుకుపోయిన ఎవర్ గివెన్ కంటైనర్ ఎట్టకేలకు కదిలింది. ప్రమాదం సమయంలో నౌక ముందు భాగం ఒక వైపు ఒడ్డున ఉన్న ఇసుకలో కూరుకుపోయింది. అంత భారీ నౌక నేలను తాకడంతో కదిలించడం అత్యంత శ్రమతో కూడిన వ్యవహారంగా మారింది. టగ్ బోట్లు, డ్రెడ్జర్లతో సూయజ్ పోర్టు అధికారులు ప్రయత్నించారు. నౌక ముందుభాగం వద్ద భారీగా ఇసుక, బురదను తవ్వేసి నీరు పారేట్లు చేశారు. దీంతో నౌక తేలిగ్గా కదలడం మొదలుపెట్టింది. అలా కదలడానికి కారణం చంద్రుడు కూడా సాయపడ్డాడని శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు.
1300 ఫీట్ల వెడల్పు ఉన్న ఆ నౌకను కదిలించేందుకు పెద్ద ఎత్తున డ్రెడ్జింగ్ చేపట్టారు. టగ్ బోట్లతో ఆ సరుకు నౌకను కదలించే ప్రయత్నమూ చేశారు. అందుకు చంద్రుడు కూడా సహకరించాడు..! పున్నమి రోజున ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి.. ఆదివారం సూపర్‌మూన్ కావడంతో.. భారీ అలలు వచ్చాయి. ఇంజనీర్లు చేస్తున్న డ్రెడ్జింగ్‌కు అలలు తోడు కావడంతో ఎవర్ గివెన్ నౌక సముద్ర నీటిలో ఈజీగా తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. పున్నమి చంద్రుడే వల్లే నౌక కదిలిందని అంటున్నారు. సుయెజ్ కాలువలో ఆ నౌక ఎందుకు అక్కడ అలా చిక్కుకుపోయిందో తెలుసుకునేందుకు ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఎవర్ గివెన్ నౌక స్తంభించడం వల్ల ఎన్నో పడవలు నిలిచిపోయాయి. మధ్యదరా, ఎర్ర సముద్రంలో ఆ నౌకలు ఆగిపోయాయి. భారీ స్థాయిలో వాణిజ్య నష్టం కలిగింది.