మందుబాబులకు శుభవార్త.. వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ
Free beer for those vaccinated against covid19. వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందిస్తున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 23 May 2021 10:25 AM ISTప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి కట్టడి చేయడానికి అనేక వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికి కొందరు ప్రజలు వ్యాక్సిన్‌ను తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అందరూ వ్యాక్సిన్ తీసుకుంటేనే ఈ మహమ్మారి కట్టడి సాధ్యం. దీంతో ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకునేలా ఆయా ప్రభుత్వాలు అవగాహాన కల్పిస్తున్నాయి. అయినప్పటికి ఇంకొందరు వ్యాక్సిన్ తీసుకునేందుకు ససేమీరా అంటున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు బంఫర్ ఆఫర్‌లు ప్రకటిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు అమెరికాలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఆపర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో బాగంగా.. కొన్ని సంస్థలు పార్కుల్లోకి ఉచిత ప్రవేశం అని ప్రకటిస్తుంటే.. మరికొన్ని సంస్థలు 50లక్షల డాలర్ల లాటరీ టికెట్ ఉచితమని ప్రకటిస్తున్నాయి. వ్యాక్పినేషన్‌కు వెళ్లే వారిని ఉబర్ ఉచితంగా తీసుకెళ్లి ఇంట్లో దిగబెడుతోంది. ఫిలడెల్పియాలో కొన్ని కంపెనీలు 100 నుంచి 200 డాలర్లు ప్రోత్సహాకంగా ఇస్తున్నాయి. ఇక న్యూ జెర్సీ ఓ బంఫర్ ఆఫర్ ప్రకటించారు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారికి ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం దీనికి మంచి స్పందన వస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం నాటికి 3.9 మిలియన్లకు పైగా న్యూజెర్సీ వాసులు టీకాలు తీసుకున్నారు.
ఎందుకు ఈ ఆఫర్లు అంటే..
ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా, వేగంగా టీకాలు సమకూర్చుకుంది అమెరికా. ఆ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. అయితే.. కొద్ది రోజులుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదించింది. ఆ దేశ జనాబా సుమారు 33 కోట్లు కాగా.. వారిలో సుమారు 16 కోట్ల మందికి రెండు డోసుల టీకా అందింది. మిగిలిన ప్రజల్ని కూడా టీకాలు వేసుకునేలా ప్రొత్సహించడానికి ప్రభుత్వం, ప్రైవేటు కంపెనీలు ఇలా ప్రోత్సహాకాలు అందిస్తున్నాయి.