టీకా తీసుకోలేదని.. 3000 మంది ఉద్యోగుల సస్పెండ్
France suspends 3000 unvaccinated health workers without pay.కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి
By తోట వంశీ కుమార్ Published on 17 Sept 2021 8:56 AM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించింది. ఈ మహమ్మారి కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి. అయితే.. కొందరు వ్యాక్సిన్‌ను వేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. చాలా దేశాల్లోని ప్రభుత్వాలు టీకా వేయించుకుంటే బంపర్ ఆపర్లను ప్రకటించాయి. అయినప్పటికి కొందరు టీకా వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. వారిలో వ్యాక్సినేషన్‌పై ఉన్న అభద్రతా బావమే అందుకు కారణం.
ఇక టీకా వేసుకుని 3 వేల మంది ఉద్యోగులకు ఫ్రాన్స్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనిపై ఆదేశ ఆరోగ్య మంత్రి ఒలివియర్ వెరాన్ స్పందించారు. వ్యాక్సిన్ వేయించుకోవాలని హెల్త్ వర్కర్స్‌కు సెప్టెంబర్ 15 వరకు డెడ్ లైన్ విధించామని తెలిపారు. ఒకవేళ టీకా వేసుకోకపోతే.. జీతం చెల్లించకుండా సస్పెండ్ చేస్తామని ఉద్యోగులందరి ముందే తెలియజేసినట్లు చెప్పారు. తాజాగా వాటినే అమలు చేసినట్లు వెల్లడించారు. దాదాపు 3 వేల మంది తొలగించగా.. వీరిలో అత్యధిక శాతం నర్సులే ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. కొందరు టీకా వేసుకునేందుకు ముందుకు రాకపోగా.. తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీన్ని బట్టే తెలుస్తోంది అక్కడ .. టీకాపై ఎన్ని అపోహాలు ఉన్నామో.