వృద్ధుడి వికృత చ‌ర్య‌.. శృంగార కోరికలను కంట్రోల్‌ చేసుకోలేక.. ఫిరంగి గుండును చొప్పించుకుని

France Man Arrives With World war-I Artillery Shell Stuck In Rectum. ఓ వృద్ధుడు తన శృంగార కోరికలను అదుపులో పెట్టుకోలేక.. వికృత చేష్టలకు పాల్పడి ప్రాణం మీదకు

By అంజి  Published on  22 Dec 2022 12:32 PM GMT
వృద్ధుడి వికృత చ‌ర్య‌.. శృంగార కోరికలను కంట్రోల్‌ చేసుకోలేక.. ఫిరంగి గుండును చొప్పించుకుని

ఓ వృద్ధుడు తన శృంగార కోరికలను అదుపులో పెట్టుకోలేక.. వికృత చేష్టలకు పాల్పడి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఆ వృద్ధుడు ఎలాగైన శృంగార అనుభూతిని పొందాలనుకున్నాడు. కోరికలు ఎక్కువ కావడంతో ఓ ఎనిమిది ఇంచుల ఫిరంగి గుండును తన పురీష నాళంలోకి చొప్పించుకున్నాడు. ఆ తర్వాత నొప్పితో నరకయాతన అనుభవించాడు. దక్షిణ ఫ్రాన్స్‌లోని టౌలాన్‌లోని సెయింట్ ముస్సే హాస్పిటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది..

ఒంటరిగా నివాసం ఉంటున్న 88 ఏళ్ల వృద్ధుడికి.. కొన్ని రోజుల నుంచి శృంగారపు ఆలోచనలు ఎక్కువయ్యాయి. వాటిని కంట్రోల్‌ చేసుకోలేక.. మొద‌టి ప్ర‌పంచ యుద్ధానికి సంబంధించిన 8 ఇంచుల ఫిరంగి గుండును త‌న పురీష‌నాళంలో చొప్పించుకున్నాడు. దీంతో తీవ్ర నొప్పికి గురయ్యాడు. ఆ తర్వాత స్థానికంగా గల ముస్సేలోని ఓ ఆస్ప‌త్రికి డిసెంబ‌ర్ 17న జాయిన్‌ అయ్యాడు. వృద్ధుడి పురీష నాళంలో ఫిరంగిని చూసి ఆస్పత్రిలో వైద్యులు షాకయ్యారు.

రాత్రి 9 గంటల నుంచి 11:30 గంట‌ల మ‌ధ్య ఆ వృద్ధుడికి వైద్యులు ఆపరేషన్‌ చేశారు. విజయవంతంగా ఆపరేషన్‌ చేసి ఫిరంగి గుండును తొల‌గించారు. ఇక ఆపరేషన్‌ టైంలో ఆ బాంబు పేలితే క‌ష్ట‌మ‌ని భావించిన వైద్యులు, ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో వారు బాంబు నిపుణులను పిలిపించి పరిస్థితిని అంచనా వేశారు. అందు కోసం బాంబు డిస్పోజ‌బుల్ సిబ్బందిని ఆస్ప‌త్రికి పిలిపించారు. ఆపరేషన్‌ తర్వాత ఆ ఫిరంగి గుండును నిర్వీర్యం చేశారు. అయితే మాన‌వ శ‌రీరంలో ఉన్న‌ స‌మ‌యంలో బాంబు పేలేందుకు ఛాన్స్‌ త‌క్కువ‌గా ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు. కాగా వృద్ధుడు చేసిన ప‌నికి అందరూ షాక్ అయ్యారు. అంతకుముందు ఫిరంగి పేలుతుందనే భయంతో ఆసుపత్రిని ఖాళీ చేయించారు.

గత ఏడాది, యునైటెడ్ కింగ్‌డమ్‌లోని గ్లౌసెస్టర్‌షైర్ రాయల్ హాస్పిటల్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఆసుపత్రి సిబ్బంది రోగి శరీరం నుండి దానిని బయటకు తీయగలిగారు, తరువాత అతన్ని డిశ్చార్జ్ చేశారు.

Next Story