మాజీ క్రికెటర్ సందీప్ శిక్ష రద్దు

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచన్నే శిక్ష రద్దయింది.

By M.S.R  Published on  16 May 2024 7:31 AM GMT
Nepal, Sandeep Lamichhane, cricket,

మాజీ క్రికెటర్ సందీప్ శిక్ష రద్దు

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపాల్ మాజీ కెప్టెన్ సందీప్ లామిచన్నే శిక్ష రద్దయింది. అతడి అప్పీల్‌పై తాజాగా క్లియరెన్స్ పొందారు. గత ఏడాది ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన లామిచన్నే శిక్షను పటాన్ హైకోర్టు బుధవారం మే 15న తోసిపుచ్చింది. 2022లో ఐ యువతిపై అత్యాచారానికి పాల్పడినందుకు లామిచన్నేకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించారు. అయితే నేపాల్ అత్యున్నత న్యాయస్థానానికి చేసిన అప్పీల్ ఫలితం వచ్చే వరకు తాత్కాలికంగా విడుదలవ్వనున్నాడు. ఖాట్మండు జిల్లా కోర్టు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను పటాన్‌ హైకోర్టు రద్దు చేయడంతో సందీప్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నేపాల్‌ మాజీ కెప్టెన్‌ లమిచానే 2022 ఆగస్టు 21న ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖాట్మండు కోర్టు అతనికి రూ. 3 లక్షలు జరిమానా, మరో రూ. 2 లక్షలు బాధితురాలికి పరిహారంతో పాటు 8 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది. బెయిల్‌పై బయటికి వచ్చిన లమిచానే కేసును బుధవారం విచారించిన హైకోర్టు కింది కోర్టు శిక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

Next Story