ఎగిరేకారు.. ఇమాజినేషన్ నుండి రియాలిటీకి వచ్చేసింది

Flying car takes to the skies for first inter city travel.ఎగిరే కారు.. ఇది కేవలం మన ఊహల్లో మాత్రమే ఉంటుందని ఇన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 7:39 AM GMT
ఎగిరేకారు.. ఇమాజినేషన్ నుండి రియాలిటీకి వచ్చేసింది

ఎగిరే కారు.. ఇది కేవలం మన ఊహల్లో మాత్రమే ఉంటుందని ఇన్ని రోజులూ అనుకునే వాళ్లం .. కానీ టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. ఎగిరే కార్లను కేవలం సినిమాల్లో మాత్రమే చూశాం..! కానీ రాబోయే రోజుల్లో ఎగిరే కార్లు మన మధ్యనే తిరగనున్నాయి. ఎగిరే కార్లకు సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి ప్రోటోటైప్స్, టెస్టింగ్ లు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఏదీ సుదూర విమాన ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి ఫ్లయింగ్ కారుగా 'ఎయిర్ కార్' నిలిచింది.

ఎయిర్ కార్ అనేది డ్యూయల్-మోడ్ కార్-ఎయిర్క్రాఫ్ట్ వాహనం. జూన్ 28 న నైట్రాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బ్రాటిస్లావాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 35 నిమిషాల విమానంలో చేరుకుని ఈ వాహనం కీలక మైలురాయిని అందుకుంది. నైట్రా విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కారు దాదాపు 8వేల ఎత్తుకు ఎగిరి బ్రాటిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. 2.15 నిమిషాల్లోనే విమానంగా మారిపోనుంది ఈ కారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుంది. ఈ ఎగిరే కారు ఒకసారి ఇంధనం నింపుకుంటే వెయ్యి కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. ఈ వాహనంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణించగలరు. ఈ కారు తయారీకి రెండేళ్లు పట్టిందని.. ఈ కారు సృష్టికర్త స్టీఫెన్ క్లిన్ తెలిపారు. కారు కిందకు దిగిన వెంటనే, అది ఒక పెద్ద స్పోర్ట్స్ కారుగా రూపాంతరం చెందుతుంది. విమానం నుండి కారుకు మారడం మూడు నిమిషాల్లోపు జరుగుతుందని కంపెనీ పేర్కొంది. ఈ కారును దాని ఆవిష్కర్త ప్రొఫెసర్ స్టీఫన్ క్లీన్ మరియు సహ వ్యవస్థాపకుడు అంటోన్ జాజాక్ డౌన్టౌన్ బ్రాటిస్లావాకు నడిపించారు.

Next Story