చికిత్సే లేని అరుదైన వ్యాధి.. రాయిగా మారుతున్న పాప‌

Five month old baby girl turning to stone.చిన్నారుల‌పై తల్లిదండ్రుల‌కు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2021 11:32 AM GMT
చికిత్సే లేని అరుదైన వ్యాధి.. రాయిగా మారుతున్న పాప‌

చిన్నారుల‌పై తల్లిదండ్రుల‌కు ఎంత ప్రేమ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. చిన్న‌పిల్ల‌ల‌కు ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా త‌ల్లడిల్లిపోతారు. అలాంటిది త‌మ క‌ళ్ల ముందే త‌మ బిడ్డ రాయిలాగా మారుతుంటే.. ఆ త‌ల్లిదండ్రులు ప‌డే ఆవేద‌న వర్ణించడానికి మాటలు చాలావు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇంగ్లాండ్ దేశంలోని హెలెన్ హెంప్ స్తేడ్, హెర్ట్ పోర్డ్ షెడ్ లో నివసిస్తున్న అలెక్స్ మరియు దవె దంపతులకి ఎదురైంది. వారి ఐదు నెలల చిన్నారి బేబీ లెక్సి రాబిన్స్ కు అత్యంత అరుదైన సమస్యను ఎదుర్కొంటుంది.

చిన్నారి లెక్సి ఫైబ్రోడిస్ప్లాసియా ఓసిఫికన్స్ ప్రోగ్రెసివా (ఎఫ్‌ఓపీ) అనే అరుదైన వ్యాధితో బాధ పడుతుంది. దీంతో ఈ పాప శరీరంలో వింత మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె తన చేతి మరియు కాలి బొటన వేలు చలనం లేకుండా రాయిగా మారిపోయాయి. ఇలాంటి జబ్బు 20 లక్షల్లో ఒకరికి సోకుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ అరుదైన జబ్బు వల్ల కండరాలు, వాటిని కలిపి ఉంటే టెండాన్స్‌, లిగిమెంట్‌ స్థానంలో ఎముకలు ఏర్పడతాయన్నారు. అంతేకాక అస్థిపంజరం వెలుపల ఎముకలు ఏర్పడి కదలికలు లేకుండా అడ్డుకుంటాయన్నారు.


చివరకు శరీరం రాయిలా కదలకుండా మారుతుందన్నారు. వీరి జీవితకాలం 40 ఏళ్లు మాత్రమే ఉంటుందని.. దానిలో కూడా సుమారు 20 ఏళ్లకు పైగా వారు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని తెలిపారు.ఇప్పటికి ఈ వ్యాధికి చికిత్స లేదని ఇంగ్లాండ్ ప్రముఖ పిడియాట్రిక్ చెప్పారు. చిన్నారి లెక్సి తల్లిదండ్రులు తమ బిడ్డ పరిస్థితిని వివరిస్తూ.. అవగాహన కల్పించే కార్యక్రమంతో పాటు చికిత్సకు సాయం చేయాల్సిందిగా కోరుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసి.. విరాళాలు సేకరిస్తున్నారు.

Next Story