విడాకులు ప్రకటించిన ప్రధాని.. బెస్ట్ ఫ్రెండ్స్ గా మిగిలి ఉంటామని కామెంట్స్

ఫిన్‌లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన భర్త మార్కస్‌ రైకోనెన్‌తో కలిసి విడాకుల కోసం

By M.S.R  Published on  11 May 2023 6:15 PM IST
Finland PM,  Sanna Marin, internationalnews, Markus Raikkonen

విడాకులు ప్రకటించిన ప్రధాని.. బెస్ట్ ఫ్రెండ్స్ గా మిగిలి ఉంటామని కామెంట్స్ 

ఫిన్‌లాండ్‌ ప్రధాని సన్నా మారిన్‌ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన భర్త మార్కస్‌ రైకోనెన్‌తో కలిసి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆమె సోషల్ మీడియాలో తెలిపారు. "మేము 19 సంవత్సరాలు కలిసి ఉన్నాం. ఈ బంధానికి కారణమైన కుమార్తెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము మంచి స్నేహితులుగా ఉంటాము" అని సోషల్ మీడియా ద్వారా ఇరువురూ తెలిపారు. సన్నా మారిన్‌- రైకోనెన్ జంటకు 5 ఏళ్ల కుమార్తె ఉంది. అంతకు ముందే ఈ జంట రిలేషన్ షిప్ లో ఉంది.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2020లో వారు వివాహం చేసుకున్నారు. కేవలం మూడంటే మూడేళ్లు వైవాహిక జీవితంలో ఉండగలిగారు. 37 ఏళ్ల మారిన్ 2019లో అధికారం చేపట్టింది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన ప్రధాన మంత్రిగా నిలిచింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. చాలా మంది ఆమెను రోల్ మోడల్‌గా భావిస్తారు.

Next Story