సంచ‌ల‌నం సృష్టించిన కేసు.. లేడీ ఆఫీస‌ర్ కాదు.. కామ పిశాచి

Female corrections officer jailed.ఆమె ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారిణి. ఖైదీల్లో మార్పులు తేవడంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 July 2021 5:45 AM GMT
సంచ‌ల‌నం సృష్టించిన కేసు.. లేడీ ఆఫీస‌ర్ కాదు.. కామ పిశాచి

ఆమె ఓ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న అధికారిణి. ఖైదీల్లో మార్పులు తేవడంతో పాటు.. వారు త‌ప్పు చేస్తే కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మార్గం వైపు న‌డిపించాలి. అయితే.. ఆమె కలలో కూడా ఊహించనలేని బరితెగింపును ప్రదర్శించటమే కాదు.. ఆమె చేసిన చేష్టల గురించి తెలుసుకున్న న్యాయమూర్తి సైతం షాక్ తిన్న వైనం ఈ ఉదంతంలో కనిపిస్తుంది. నిత్యం కామదాహంతో రగిలిపోతూ.. జైల్లో ఉన్న ఖైదీలతో ఇష్టారాజ్యంగా శృంగారం చేయ‌డం చేసేది. కొందరు ఖైదీలు తెగించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయ‌డంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివ‌రాల్లోకి వెళితే.. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ జైల్లో పురుష ఖైదీల పర్యవేక్షణ‌, స‌వ‌ర‌ణ‌ల అధికారిణిగా టీనా గోన్‌జ‌లెజ్‌(27) మూడేళ్ల పాటు ప‌నిచేసింది. త‌న విధి నిర్వహణలో చేయాల్సిన డ్యూటీని వదిలేసి.. ఖైదీలపై లైంగిక వేధింపులకు పాల్పడిందన్నది ఆమెపై నమోదైన ప్రధాన ఆరోపణ. నగ్నంగా వీడియో కాల్స్‌ మాట్లాడాలని, ఫోన్‌ కాల్స్‌లో శృంగార సంభాషణలు కొనసాగించాలని ఆమె ఖైదీలను బెదిరించేది. కామ వాంఛల్ని తీర్చుకునేందుకు ఒకరితో సెక్సు చేస్తూనే.. చుట్టూ ఉన్న వారు తనను కన్ను ఆర్పకుండా చూడాలన్నకండీషన్ పెట్టేది. అంతేకాదు.. పోర్న్ వీడియోలు చూపించి అందులో మాదిరి తనకు చేయాలని ఒత్తిడి చేసేది. శృంగారంలో పాల్గొనటానికి వీలుగా తన యూనిఫామ్ కు ఆమె రంధ్రాలు చేసుకొని మరీ వచ్చేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఓసారి 11 మంది ఖైదీలు చూస్తుండ‌గా.. ఓ ఖైదీతో శృంగారంలో పాల్గొందన్నారు.

ఆమె మీద వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆమెను విధుల నుంచి తొలగించటమే కాదు.. విచారణ కమిటీని వేశారు. అందులోనూ ఆమె దారుణాల గురించి పేర్కొన్నారు. తాను చెప్పినట్లు సెక్సు చేసిన ఖైదీలకు రిటర్న్ గిప్టులుగా సెల్ ఫోన్లు.. మద్యం.. డ్రగ్స్ ను అందించేవారని తేల్చారు. ఇందుకు సెక్స్ రిటర్న్ గిప్గులుగా ఆమె పేర్కొనేవారిని వెల్లడైంది. ఈ కేసు విచారణకు తాజాగా న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌కు న్యాయ‌మూర్తి సైతం షాక్‌కు గుర‌య్యారు. 'నువ్వు దారుణంగా ప్ర‌వ‌ర్తించావు. నీ కెరీర్‌ను స‌ర్వ‌నాశ‌నం చేసుకున్నావు'. అని వ్యాఖ్యానించారు. చివరకు ఆమెకి మూడేళ్ల ఎనిమిది నెలలు శిక్ష వేశారు.

Next Story