ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి తీవ్ర చర్చ కొనసాగుతూ ఉంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం లేకపోలేదని అంటూ ఉన్నారు. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో చాలా రీసెర్చ్ లు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి ఎలాన్ మస్క్ కూడా చేరిపోయాడు.
ఎలోన్ మస్క్ X.AI Corp అనే కొత్త కృత్రిమ మేధస్సు (AI) కంపెనీని స్థాపించారు. స్టేట్ ఫైలింగ్ ప్రకారం, నెవాడాలో ఈ కొత్త కంపెనీని తీసుకుని వస్తున్నారు. మస్క్‌ను ఏకైక డైరెక్టర్‌గా, జారెడ్ బిర్చాల్‌ను కార్యదర్శిగా పేర్కొన్నారు. AI అభివృద్ధి గురించి గతంలో ఆందోళన వ్యక్తం చేసిన మస్క్, కొత్త ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహించడానికి శాస్త్రవేత్త ఇగోర్ బాబూస్కిన్‌తో సహా ఇద్దరు మాజీ డీప్‌మైండ్ పరిశోధకులను నియమించినట్లు తెలుస్తోంది. X.AI Corp గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. అయితే ప్రముఖ AI భాషా మోడల్, ChatGPTకి ప్రత్యర్థిగా అభివృద్ధి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.