మస్క్‌ సంచలన నిర్ణయం.. ట్విటర్‌ సీఈవోగా మహిళ.. త్వరలోనే బాధ్యతలు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ సీఈవోగా కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అపర కుబేరుడు,

By అంజి  Published on  12 May 2023 9:00 AM IST
Elon Musk, Twitter, Social media

మస్క్‌ సంచలన నిర్ణయం.. ట్విటర్‌ సీఈవోగా మహిళ.. త్వరలోనే బాధ్యతలు

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ సీఈవోగా కొత్త వ్యక్తి బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని అపర కుబేరుడు, ప్రస్తుత ట్విటర్‌ సీఈవో ఎలాన్‌మస్క్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. మరో ఆరు వారాల్లో కొత్త సీఈవోగా ఓ మహిళ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. అయితే ఆ మహిళ ఎవరనే విషయాన్ని మాత్రం మస్క్‌ వెల్లడించలేదు. ట్విటర్‌ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత తాను చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్, ప్రొడక్ట్‌, సాఫ్ట్‌వేర్‌ విభాగాల బాధ్యతలు చూసుకోనున్నట్లు మస్క్‌ తన ట్విట్‌లో పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ అధినేతగా తీరిక లేని షెడ్యూల్‌తో మస్క్‌ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ 26వ తేదీన ట్విట్టర్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన మస్క్‌.. 44 బిలియన్ డాలర్లను ధారపోసి ట్విటర్‌ను టేకోవర్ చేశారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో గల ట్విట్టర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ అడుగు పెట్టిన వెంటనే సీఈఓగా పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.

Next Story