ఘోరప్రమాదం: ఢీకొన్న కార్లు, బస్సులు.. 32 మంది మృతి
ఈజిప్టులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. 32 మంది చనిపోయారని.. మరో 60 మందికి పైగా గాయపడ్డారు.
By Srikanth Gundamalla Published on 28 Oct 2023 6:30 PM ISTegypt accident at least 32 dead 60 injured
ఈజిప్టులో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఆ దేశ రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియా నగరాన్ని కలిపే రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కార్లు, బస్సులు ఒకదానిని మరోటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 32 మంది చనిపోయారని.. మరో 60 మందికి పైగా గాయపడి ఉంటారని ఈజిప్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో #Egypt
Dozens of people killed in 30-vehicle collision in Egypt - local media
The massive accident on the Cairo-Alexandria highway killed 28 people and injured another 60.
Al-Ahram newspaper reported that an oil leak from one vehicle may have led to a collision that caused… pic.twitter.com/3kjiZwLgkx
ఈజిప్టు కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై వెళ్తున్న మూడు ప్యాసింజర్ బస్సులు, పది కార్లు ఒకదానిని మరోటి ఢీకొన్నాయి. దాంతో.. ఓ కారులో నుంచి ఆయిల్ లీక్ అయ్యింది. వెంటనే మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మిగతా వాహనాలకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. దాంతో.. ప్రమాద తీవ్రత పెరిగింది. దాదాపు 18 వరకు ఆ మంటల్లో చిక్కుకునే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. కొందరు ఆ మంటల్లో నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇంకొందరికి వాహనాలు ఢీకొనడంతో తీవ్రగాయాలు అయ్యాయి.
ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలను ప్రారంభించారు. ఫైరింజన్లు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ఘటనలో గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదంలో వాహనాలు దాదాపు తుక్కు తుక్కు అయినట్లు వీడియోలో కనిపిస్తోంది. కార్లలో ఇరుక్కున్న వారిని స్థానికులు బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మంటలు అంటుకోవడంతో భారీ ఎత్తున పొగ అలుముకుంది. ఘటనాస్థలిలో భయానక వాతావరణం కనిపించింది.
#Egypt Dozens of people killed in 30-vehicle collision in Egypt - local mediaThe massive accident on the Cairo-Alexandria highway killed 28 people and injured another 60.Al-Ahram newspaper reported that an oil leak from one vehicle may have led to a collision that caused… pic.twitter.com/3kjiZwLgkx
— UNEWS (@UNEWSworld) October 28, 2023