ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.8

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది.

By Srikanth Gundamalla  Published on  3 Aug 2024 9:30 AM IST
earthquake , Philippines, magnitude 6.8,

 ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.8 

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. మిండనావో ద్వీపం తూర్పు తీరంలో భూప్రకంపణలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని జర్మన్ రీసెర్చ్‌ సెంటర్ ఫర్ జియోసైన్సెస్‌ వెల్లడించింది.

భూకంపం గురించి యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాలను తెలిపింది. ఈ వివరాల ప్రకారం భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఈ విపత్తు కారణంగా ఎలాంటి సునామీ ముప్పు లేదని అమెరికా జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఫిలిప్పీన్ సిస్మోలజీ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరగలేది తెలిసింది. అయితే ఈ భూకంపం అనంతర కూడా ప్రకంపనలు వస్తాయని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ దేశం పసిఫిక్ మహాసముద్రం తీరంలోని రింగ్ ఆఫ్ ఫైర్ జోన్‌లో ఉంది. అయితే.. ఈ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. మరోవైపు ఇదే ప్రాంతంలో అగ్నిపర్వతాలు బద్దలు కావడం సర్వసాధారణమని అధికారులు చెబుతున్నారు.

Next Story