చిలీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదు

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 19 July 2024 9:45 AM IST

earthquake,  chile, 7.3 magnitude strikes ,

చిలీలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదు

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. అర్జెంటీనా-చిలీ సరిహద్దుల్లోని అంటోఫస్టాలో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.3గా నమోదు అయ్యింది. 128 కిలోమీటర్ల లోతులో భూప్రంకపనలు చోటుచేసుకున్నాయని యూరోపియన్-మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్‌ వెల్లడించింది. కాగా.. ఈ భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు.

ఈ భూకంప ఘటనపై చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ మేరకు పోస్టు పెట్టిన ఆయన.. "నేను ఇప్పటికే ప్రాంతీయ ప్రతినిధితో కమ్యూనికేట్ చేసాను. ఇప్పటివరకు పెద్ద నష్టం గురించి ఎటువంటి నివేదికలు లేవు. కానీ బృందాలు సమాచారాన్ని సేకరిస్తున్నాయి అని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి సునామీ హెచ్చరిక జారీ చేయబడలేదు.

ఈ ఏడాది జనవరిలో చిలీ ఉత్తర ప్రాంతంలోని తారాపాకాలో 118 కిలోమీటర్ల లోతులో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. చిలీ పసిఫిక్‌లోని "రింగ్ ఆఫ్ ఫైర్" అని పిలవబడే ప్రాంతంలో ఉంది. తరచుగా భూకంపాలను సంభవిస్తాయి. 2010లో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాంతో.. ఆ తర్వాత వచ్చిన సునామీ వల్ల 526 మంది ప్రాణాలు కోల్పోయారు.



Next Story