ఏ దేశంలోనైనా.. జైళ్లకు పోలీసులే కాపలా ఉంటారు. ఖైదీలు ఎవరైనా పారిపోవాలని చూస్తే.. క్షణాల్లో వారిని పట్టుకుంటారు. కానీ, ఓ దేశంలోని జైళ్లలో మాత్రం కాపలాగా.. బాతులు ఉన్నాయి. నిరంతరం జైళ్లో తిరుగుతూ ఖైదీలు పారిపోకుండా చూసుకుంటాయి. మరి అక్కడి జైళ్లలో బాతులనే ఎందుకు కాపలాదారుగా పెట్టారో మీరూ తెలుసుకుంటారా?
బాతులే.. అధికారిక కాపలాదారులు
జైళ్లకు బాతులు కాపలాగా ఉన్న దేశం.. బ్రెజిల్. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన శాంటా కాంటారినాలో ఉండే జైళ్లకు సీసీ కెమెరాలు ఉన్నా సరే.. బాతులే అధికారిక కాపలాదారులు. ఒక్కప్పుడు ఇక్కడి జైళ్లకు కుక్కలు కాపలాగా ఉండేవట. తర్వాత కాలంలో కుక్కలను తొలగించి వాటి స్థానంలో బాతులను కాపలాగా ఉంచారు. అవి జైలు అంతా తిరుగుతూ.. ఖైదీలు చిన్న చప్పుడు చేసినా గట్టిగా అరుస్తూ పోలీసులను పిలుస్తాయట.
బాతులే ఎందుకు..
బాతులు.. కుక్కల కంటే శబ్దాలను బాగా వినగలవట. అంతే కాకుండా బాతులను జైలు లోపల వదలడం వల్ల ఖైదీలు గోడలు పగలగొట్టడం, నేలకు రంధ్రాలు పెట్టడం వంటివి చేస్తున్నప్పుడు వచ్చే చిన్న చిన్న శబ్దాలకు కూడా బాతులు అరుస్తాయట. దీంతో పోలీసులు ఆ ఖైదీలను పట్టుకునేందుకు సహాయపడతాయట. అంతే కాకుండా బాతుల పోషణ కూడా చాలా తక్కువట.
"మాకు ఎలక్ట్రానిక్ నిఘా ఉంది, వ్యక్తిగతంగా నిఘా ఉంది.. చివరకు కుక్కల స్థానంలో పెద్దబాతులను నిఘా కొరకు ఉంచాం" అని జైలు డైరెక్టర్ మార్కోస్ రాబర్టో డి సౌజా చెప్పారు.