Video: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భారీ అగ్నిప్రమాదం.. విమాన సర్వీసులు రద్దు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ దుబాయ్‌ను తాకింది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ...
By - అంజి |
Video: దుబాయ్ విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. భారీ అగ్నిప్రమాదం.. విమాన సర్వీసులు రద్దు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం సెగ దుబాయ్‌ను తాకింది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) సమీపంలోని ఒక ఇంధన ట్యాంక్‌పై డ్రోన్ దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ విమానాశ్రయం వద్ద జరిగిన ఈ ఘటనపై దుబాయ్ సివిల్ డిఫెన్స్ బృందాలు తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని దుబాయ్ మీడియా ఆఫీస్ ప్రకటించింది.
ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, ఇందులో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడటం కనిపించింది. ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని మూడు ప్రధాన ఓడరేవులను ఖాళీ చేయాలని ఇరాన్ ఆదివారం హెచ్చరించింది. ఇరాన్‌కు చెందిన ఖార్గ్ ఐలాండ్ ఆయిల్ టెర్మినల్‌పై ఇటీవల జరిగిన దాడులకు అమెరికా యూఏఈ రేవులను వేదికగా వాడుకుంటోందని టెహ్రాన్ ఆరోపిస్తోంది.
JUST IN: 🇮🇷🇦🇪 Iranian drone strikes near Dubai International Airport, causing a large fire. pic.twitter.com/hBnyBwZh9e
— BRICS News (@BRICSinfo) March 16, 2026
ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం తర్వాత మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలు మరియు దాని మిత్రదేశాల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా నిరంతరం దాడులు జరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా గల్ఫ్ దేశాలపై దాదాపు 2,000కు పైగా మిస్సైల్, డ్రోన్ దాడులు జరిగాయి. మార్చి 1న బుర్జ్ అల్ అరబ్ హోటల్, విమానాశ్రయంపై జరిగిన దాడుల్లో నలుగురు గాయపడగా, మళ్లీ మార్చి 7న కూడా విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. తాజా దాడితో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు; అలర్ట్ ప్రకటించగానే విమానాశ్రయం లోపల ఉన్న వారు రక్షణ కోసం రైలు టన్నెల్స్‌లోకి పరుగులు తీశారు.