బిగ్ డిబేట్.. ట్రంప్ ధాటికి తేలిపోయిన బైడెన్.. ఇందుకేనట!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి.
By Srikanth Gundamalla Published on 6 July 2024 4:30 AM GMTబిగ్ డిబేట్.. ట్రంప్ ధాటికి తేలిపోయిన బైడెన్.. ఇందుకేనట!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు ట్రంప్ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఇందులో ట్రంప్ ధాటికి బైడెన్ తేలిపోయారు. ఈ నేపథ్యంలో చర్చ గురించి ఏం జరిగిందనేది బైడెన్ వివరించారు. తాను భయంకరమైన అనుభూతికి గురయినట్లు బైడెన్ తెలిపారు. ట్రంప్‌తో చర్చ జరిగిన రోజు తాను అనారోగ్యంతో ఉన్నానని అన్నారు. తీవ్రమైన జలుబు కారణంగా అస్వస్థతకు లోనయ్యానని అన్నారు. అది తనకు భయంకరమైన అనుభూతని చెప్పారు. కానీ.. తాను అధ్యక్ష రేసులో ఉన్నట్లు వెల్లడించారు. ట్రంప్‌ను కచ్చితంఆ ఓడిస్తానని బైడెన్ దీమాగా చెప్పారు.
చర్చలో భాగంగా బైడెన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. దాంతో.. ఈ చర్చల్లో ట్రంప్ పైచేయి సాధించాడని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ ప్రచారర్వంతో అలసిపోతున్నారని తెలుస్తోంది. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. నిద్రపోవడానికి మరింత సమయం కావాలనీ.. రాత్రి 8 తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని బైడెన్ చెప్పారు. డెమోక్రాటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో బైడెన్ పేర్కొన్నారు.